E-Paper
Advertisement

అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తోన్న Vivo X500.. పూర్తి వివరాలు మీ కోసం!

అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తోన్న Vivo X500.. పూర్తి వివరాలు మీ కోసం!
Advertisement

Vivo X500: తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. ఇప్పుడు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌గా Vivo X500ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. గతేడాది వచ్చిన Vivo X300 సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ సరికొత్త లైనప్ రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌లో రకరకాల లీకులు, రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సిరీస్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. అవేంటంటే..

పవర్‌ఫుల్ చిప్‌సెట్:

మొదట్లో ఈ ఫోన్‌లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రాసెసర్ ఉంటుందని అందరూ భావించారు. కానీ తాజా లీకుల ప్రకారం.. Vivo X500 స్టాండర్డ్ మోడల్‌లో గతేడాది వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని అంతర్గతంగా DX5 అని పిలుస్తున్నారు. ఇది 3 నానోమీటర్ టెక్నాలజీపై పనిచేసే ఆక్టాకోర్ ప్రాసెసర్. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా వేగంగా, స్మూత్‌గా ఉండబోతోంది.

Advertisement

Also Read: ధర తక్కువే కానీ ఫీచర్లు అద్భుతం.. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్!

కెమెరాలో పెద్ద మార్పు:

ఫొటోగ్రఫీ విషయంలో వివో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈసారి కూడా Vivo X500 కెమెరా విభాగంలో పెద్ద మార్పులే చేయబోతోంది. గత మోడల్‌లో ఉన్న 50MP సెన్సార్ స్థానంలో, ఈ కొత్త ఫోన్‌లో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించనున్నట్లు సమాచారం. అలాగే ఫోన్ వెనుక భాగంలో 1/1.28 ఇంచుల 50MP మెయిన్ కెమెరా కూడా ఉండనుంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచుల పెద్ద డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. యూజర్లను ఆకట్టుకునే మరో ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఈ ఫోన్‌లో ఏకంగా 7,500mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ గురించి ఆలోచన లేకుండా రోజంతా హ్యాపీగా ఫోన్‌ వాడుకోవచ్చు.

సిరీస్‌లో కొత్త మోడల్స్:

ఈ ఏడాది వివో తమ లైనప్‌లో మరికొన్ని మార్పులు చేయనుంది. స్టాండర్డ్ మోడల్‌తో పాటు Vivo X500 Pro, అలాగే కొత్తగా Pro Max మోడల్‌ను కూడా పరిచయం చేయవచ్చని టాక్. Pro మోడల్స్‌లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. అంటే ఈసారి స్టాండర్డ్, ప్రో మోడల్స్ వేర్వేరు ప్రాసెసర్లతో రానున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read: 200MP కెమెరా, కేక పెట్టించే డిజైన్.. శాంసంగ్ సరికొత్త అల్ట్రా ఫోన్ ఫస్ట్ లుక్ చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×