E-Paper
Advertisement

144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!

144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!
Advertisement

Vivo X500 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో అంటేనే ఒక క్రేజ్. ముఖ్యంగా కెమెరా, లుక్స్ విషయంలో వివో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. మొన్నటికి మొన్న Vivo X300 Ultraతో మార్కెట్లో హడావుడి చేసిన ఈ కంపెనీ.. ఇప్పుడు అంతకు మించిన పవర్‌ఫుల్ ఫీచర్లతో Vivo X500 సిరీస్‌ను తీసుకురావడానికి రెడీ అయిపోయింది. ఈ సిరీస్‌లో Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max అనే 3 అదిరిపోయే మోడల్స్ రాబోతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లీకుల ప్రకారం.. ఈ ఫోన్లలో ఉండబోయే డిస్‌ప్లే ఫీచర్లు చూస్తుంటే టెక్ వరల్డ్ షేక్ అవ్వడం ఖాయమనిపిస్తోంది.

కళ్లు చెదిరే డిస్‌ప్లే క్వాలిటీ..

సాధారణంగా మనం ఫోన్ వాడేటప్పుడు స్క్రీన్ ఎంత స్మూత్‌గా ఉంటే అంత హాయిగా ఉంటుంది. అందుకే వివో ఈసారి ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్‌ను పట్టుకొస్తోంది. దీంతో గేమ్స్ ఆడినా, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేసినా స్క్రీన్ వెన్నలా సాగిపోతుందన్నమాట. దీనికి తోడు సెక్యూరిటీ విషయంలో కూడా వివో రాజీ పడలేదు. అన్ని మోడళ్లలోనూ సరికొత్త 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇస్తున్నారు. దీనివల్ల చేతులు తడిగా ఉన్నా సరే, చిటికెలో ఫోన్ అన్‌లాక్ అయిపోతుంది.

Advertisement

Also Read: యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. iPhone 18 Pro కెమెరా చూస్తే షాక్ అవ్వాల్సిందే, ఫొటోలు లీక్!

ఏ సైజు కావాలంటే ఆ సైజులో..

స్క్రీన్ సైజు విషయంలో కూడా వివో వెరైటీ చూపిస్తోంది. బేసిక్ మోడల్ Vivo X500 సుమారు 6.37 అంగుళాల డిస్‌ప్లేతో కాస్త కాంపాక్ట్‌గా ఉండబోతోంది. ఇక పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారి కోసం Vivo X500 Pro మోడల్ 6.85 అంగుళాల భారీ 2K రిజల్యూషన్ స్క్రీన్‌తో వస్తోంది. అలాగే ఈ ఫోన్లలో LTPO టెక్నాలజీ వాడటం వలన.. మనం చేసే పనిని బట్టి స్క్రీన్ పవర్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ అనవసరంగా ఖర్చు కాదు.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఫోన్ స్పీడ్ విషయంలో వివో ఎప్పుడూ వెనక్కి తగ్గదు. ఈ సిరీస్‌లోని ప్రో మాక్స్ మోడల్‌లో లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే.. ఏకంగా 7,000mAh బ్యాటరీని ఇస్తున్నారట. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఛార్జర్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఎంత ఎక్కువ వాడినా బ్యాటరీ అయిపోతుందన్న టెన్షన్ అస్సలు ఉండదు.

కెమెరా అంటేనే వివో..

ఈ సిరీస్‌లో మెయిన్ కెమెరా కోసం సోనీ సెన్సార్‌ను వాడుతున్నారు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఇందులోని 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా మనం పక్కనే ఉన్నట్టుగా ఫొటోలు తీసుకోవచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ ఫోన్లు మన ముందుకు రానున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు కొన్నాళ్లు వెయిట్ చేస్తే మంచి ఆప్షన్ దొరికినట్టే.

Also Read: చైనా ఫోన్లకు పోటీగా దేశీ బ్రాండ్ హవా.. జస్ట్ రూ.12 వేలకే 6GB ర్యామ్ 5G ఫోన్ తెచ్చిన లావా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×