E-Paper
Advertisement

ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!

ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!
Advertisement

Vivo X500 Pro Max: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ బ్రాండ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న లీక్స్ ప్రకారం.. వివో తమ తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Vivo X500 Pro Maxలో ఊహించని రేంజ్ కెమెరా అప్‌గ్రేడ్స్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.

సరికొత్త కెమెరా సెటప్:

ఈ ఫోన్‌లో మెయిన్ కెమెరా విషయానికి వస్తే.. 50 మెగాపిక్సెల్ సోనీ LOFIC ప్రైమరీ సెన్సార్‌ను వివో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు వైడ్ యాంగిల్ షాట్స్ కోసం మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను కూడా అందించనున్నారు. ఫొటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ఇందులో మెరుగైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) టెక్నాలజీని వాడుతున్నట్లు టాక్.

200MP పెరిస్కోప్ లెన్స్:

Advertisement

ఈ ఫోన్ లీక్స్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధానాంశం దీని పెరిస్కోప్ కెమెరా. దీనిలో ఏకంగా 200 మెగాపిక్సెల్ సామర్థ్యం గల పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇవ్వబోతున్నారట. 85mm ఫోకల్ లెంగ్త్‌తో రాబోతున్న ఈ కెమెరా ద్వారా చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా షూట్ చేయొచ్చు. అంతేకాదు.. అద్భుతమైన టెలిఫోటో మాక్రో ఫొటోగ్రఫీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

పెర్ఫార్మెన్స్ పరంగానూ ఈ ఫోన్ దుమ్మురేపనుంది. మీడియాటెక్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌ఎమ్‌సీ 2nm ప్రాసెస్ ఆధారంగా తయారవుతున్న మొదటి చిప్‌సెట్ ఇదే కావడం విశేషం. దీనికి తోడు లేటెస్ట్ LPDDR6 ర్యామ్, అలాగే ఏకంగా 8,000mAh సామర్థ్యం గల బ్యాటరీని దీనిలో అమర్చనున్నట్లు లీక్స్ చెబుతున్నాయి.

ఆకట్టుకునేలా డిస్‌ప్లే:

ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.85 ఇంచుల 2K OLED LTPO డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. చైనా మార్కెట్‌తో పాటు ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలోనూ లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫీచర్స్ గురించి వివో సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: ఇలాంటి ఇయర్‌బడ్స్ ఎప్పుడూ చూసుండరు.. చెవికి క్లిప్‌లా తగిలించుకుంటే చాలు, బ్యాటరీ లైఫ్ అద్భుతం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×