// // Vivo X300 FE Launched: 6500mAh బ్యాటరీ, జీస్ కెమెరాతో వివో X300 FE లాంచ్! -->
E-Paper
Advertisement

భారత్‌లోకి వచ్చేసిన Vivo X300 FE .. ఐదేళ్ల అప్‌డేట్స్, 100x జూమ్ కెమెరా.. ఐఫోన్, శాంసంగ్‌లకు చుక్కలే!

భారత్‌లోకి వచ్చేసిన Vivo X300 FE .. ఐదేళ్ల అప్‌డేట్స్, 100x జూమ్ కెమెరా.. ఐఫోన్, శాంసంగ్‌లకు చుక్కలే!
Advertisement

Vivo X300 FE Launched: ప్రముఖ వివో కంపెనీ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ Vivo X300 FE భారతదేశంలో ఎట్టకేలకు విడుదలైంది. X సిరీస్‌లో ఇది నాలుగో ఫోన్. అయితే.. గతేడాది మోడల్స్‌తో పోలిస్తే ఈసారి రేటు కొంచెం ఎక్కువే ఉంది. మెమరీ చిప్‌ల కొరత వల్ల ధర పెంచక తప్పలేదని కంపెనీ అంటోంది. ధర ఎక్కువైనా సరే.. దీనిలో ఉన్న ఫీచర్లు చూస్తే మాత్రం అబ్బా అనాల్సిందే. మరి ఈ కొత్త ఫోన్ విశేషాలేంటో ఒకసారి చూద్దామా!

అందుబాటులోకి ఎప్పుడంటే?

ఈ Vivo X300 FE రేటు విషయానికి వస్తే.. 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ రూ.79,999కి దొరుకుతుంది. ఇంకా ఎక్కువ స్పేస్ కావాలంటే 512GB వేరియంట్ రూ.89,999కి లభిస్తుంది. మే 14 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. SBI, Axis వంటి బ్యాంక్ కార్డులు ఉంటే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. ఇక కలర్స్ విషయానికొస్తే.. లైలాక్ పర్పుల్, బ్లాక్, ఆలివ్ రంగుల్లో భలే స్టైలిష్‌గా ఉన్నాయి.

ఎండలోనూ ఫుల్ క్లారిటీ..

Advertisement

ఈ ఫోన్ స్క్రీన్ చూడటానికి చాలా రిచ్‌గా ఉంటుంది. 6.31 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వీడియోలు చూస్తుంటే మంచి ఫీల్ వస్తుంది. 5,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల మండుటెండలో బయట నిలబడి ఫోన్ చూసినా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి నీరు, దుమ్ము నుంచి రక్షణ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ గురించి దిగులు పడక్కర్లేదు.. ఐదేళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Also Read: నిజమండీ బాబూ.. రూ.9 వేలకే iPhone లాంటి ఫోన్.. నమ్మట్లేదా? అయితే మీరే చూసేయండి!

పెర్ఫార్మెన్స్‌లో తోపు..

Advertisement

గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి, ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకూడదు అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ వాడారు. ఫోన్ వేడెక్కకుండా స్పెషల్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా, ఎంత సేపు గేమ్స్ ఆడినా ఫోన్ మాత్రం చాలా స్మూత్‌గా, కూల్‌గా పనిచేస్తుంది.

కెమెరా అంటే వివోనే..

వివో ఫోన్ అంటేనే కెమెరా కదా. Vivo X300 FEలో Zeiss ట్యూనింగ్ ఉన్న 50MP మెయిన్ కెమెరా ఉంది. అలాగే రాత్రిపూట తీసే ఫొటోలు కూడా డే లైట్‌లో తీసినట్లే వస్తాయి. ఇక 50MP టెలిఫోటో లెన్స్‌తో 100 రెట్లు జూమ్ చేసి చూడొచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం ముందు కూడా 50MP కెమెరానే ఇచ్చారు. ఫొటోలు, వీడియోలు మాత్రం ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్లు చాలా క్లారిటీగా వస్తాయి.

నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..

Vivo X300 FEలో ఏకంగా 6,500mAh పెద్ద బ్యాటరీని పెట్టారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు. పైగా 90W వైర్డ్ ఛార్జింగ్‌తో చిటికెలో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. అన్ని రకాల 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. ఇంటర్నెట్ స్పీడ్ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు.

Also Read: Honor Play 80 Plus విడుదలైంది రోయ్.. 7,500mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16.. ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×