// // Vivo X300 FE: వివో X300 FE వస్తోంది.. జైస్ టెలిఫోటో కిట్‌తో కెమెరా ఇక రచ్చే! -->
E-Paper
Advertisement

ఫోన్ కెమెరాకు లెన్స్ పెట్టుకోవచ్చు.. ఈ Vivo X300 FE కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?

ఫోన్ కెమెరాకు లెన్స్ పెట్టుకోవచ్చు.. ఈ Vivo X300 FE కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?
Advertisement

Vivo X300 FE: ప్రముఖ టెక్ సంస్థ వివో నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘Vivo X300 FE’ పేరుతో మార్చి నెలలోనే రష్యా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్.. ఇప్పుడు మన దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో X300 కంటే ఇది కొంచెం తక్కువ ధరకే దొరకవచ్చు కానీ, ఫీచర్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా ఫొటోల పిచ్చి ఉన్నవాళ్ల కోసం వివో ఈసారి ‘జీస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్’ అనే ఒక స్పెషల్ ఐటమ్‌ను పరిచయం చేస్తోంది.

ఈ ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దాని కెమెరా కిట్. మామూలుగా మనం ప్రొఫెషనల్ కెమెరాలకు లెన్స్‌లు మార్చుకున్నట్టే.. ఈ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన ఎక్స్‌టెండర్ కిట్‌ను వివో విడిగా అమ్మబోతోంది. దీన్ని ఫోన్ వెనుక ఉండే టెలిఫోటో లెన్స్‌కు తగిలిస్తే చాలు.. జూమ్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. దీంతో చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా మనం దగ్గరగా, ఎంతో క్లారిటీగా ఫొటోలు తీసుకోవచ్చన్నమాట. అలాగే వైల్డ్ లైఫ్ ఫొటోలు తీసేవాళ్లకి, ట్రావెలర్స్‌కి ఇదొక బెస్ట్ గ్యాడ్జెట్ లాంటిదని టెక్ నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read: రూ.13,000 లోపు Redmi A7 Pro 5G .. మిడిల్‌క్లాస్ యూజర్లకు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది!

ఈ ఫోన్ కేవలం కెమెరాలోనే కాదు.. పర్ఫార్మెన్స్‌లో కూడా తోపు అనిపించుకోబోతోంది. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడుతున్నారు. దీనివల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు సరే కదా, బ్యాటరీని కూడా చాలా పొదుపుగా వాడుకుంటుంది. ఇక లుక్స్ విషయానికి వస్తే.. 7.99mm మందంతో చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. బ్లాక్, గ్రీన్, పర్పుల్ వంటి కలర్స్‌లో వచ్చే ఈ ఫోన్‌కు వెనుక వైపు AG ఫ్రాస్టెడ్ ఫినిషింగ్ ఇచ్చారు. దీనివల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం‌గా అనిపిస్తుంది.

Advertisement

ఇకపోతే సాఫ్ట్‌వేర్ పరంగా వివో ఈసారి ఒక అడుగు ముందే ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఆరిజిన్ ఓఎస్ 6 ఇందులో ఉండబోతోంది. అటామిక్ ఐలాండ్ అనే కొత్త ఫీచర్ ద్వారా ఫైల్స్ ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు పంపడం ఇప్పుడు చాలా ఈజీ. అంతేకాదు.. దీనిలో ఉన్న AI టూల్స్ సాయంతో మనం తీసిన ఫొటోలకు రకరకాల ఎఫెక్ట్స్ జోడించవచ్చు. దీంతో మీరు తీసిన మామూలు ఫొటోలో కూడా మంచు కురుస్తున్నట్టు లేదా ఆకాశంలో రంగురంగుల కాంతులు ఉన్నట్టు మార్చేయొచ్చు.

ఫోన్ ఎంత బాగున్నా బ్యాటరీ త్వరగా అయిపోతే చిరాకు వస్తుంది కదా. అందుకే వివో దీనిలో 6,500mAh భారీ బ్యాటరీని పెట్టింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి కేబుల్స్ గోల ఉండదు. ఐఫోన్, శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్న ఈ వివో X300 FE.. మే నెల మొదటి వారంలో మన మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: కలా? నిజమా? iPhone 15 రూ.35,000కే వచ్చేస్తోంది.. ఇవిగో పూర్తి వివరాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×