E-Paper
Advertisement

Vivo X100 Ultra : వివో నుంచి శాటిలైట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది మచ్చా!

Vivo X100 Ultra : వివో నుంచి శాటిలైట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది మచ్చా!
Advertisement

Vivo X100 Ultra : ఇండియా మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇటువంటి వారికి ప్రముఖ ఎలక్ట్రిక్ టెక్ కంపెనీ వివో శుభవార్త చెప్పింది. కంపెనీ తన బ్రాండ్ నుంచి వివో X100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌పై వర్క్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఫోన్ లాంచ్ చేసేందుకు ఇటివలే వివో రిజిస్టర్ చేసుకున్నట్లు ఇంటర్నెట్‌లో సమాచారం అందుబాటులో ఉంది. వివో X100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ శాటిలైట్ కనెక్టవిటీతో వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త వివో స్మార్ట్ ఈ వారం ప్రారంభంలోనే 3C సర్టిఫికేషన్ పొందింది. మొదటగా ఈ ఫోన్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. X100 అల్ట్రా మోడల్ నంబర్ V2366GAతో గుర్తించబడింది. ఫోన్ లాంచ్ కోసం కంపెనీ సన్నాహాలు ప్రారంభించిందని ఈ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది.

Advertisement

కొన్ని నివేదికల ప్రకారం శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ అందించబడే Vivo మొదటి ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ శాటిలైట్ వెర్షన్ ఇప్పుడు మోడల్ నంబర్ V2366HAతో రేడియో కన్ఫర్మేషన్ పొందింది. ఫోన్ కమ్యూనికేషన్ల కోసం టియాంటాంగ్ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తుంది. అయితే దీని గురించి కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు.

Also Read : అదిరిందయ్యా.. రెడ్‌మీ నుంచి 200 MP కెమెరా ఫోన్!

Advertisement

Vivo X100 అల్ట్రా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఫోన్‌లో 80 వాట్స్ వైర్డు ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇచ్చే  5,500 mAh బ్యాటరీని ఇందులో చూడవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్లో టాప్ మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది సోనీ  Lytia LYT-900 సెన్సార్‌ను పొందే అవకాశం ఉంది. దీనితో పాటు 100mm (4.3x) 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండొచ్చు. పెర్ఫామెన్స్ కోసం ఇందులో ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. చిప్‌సెట్ MediaTek లేదా Qualcomm నుండి ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. Vivo X100 అల్ట్రాతో పాటు X100s, X100s ప్రోలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×