E-Paper
Advertisement

Vivo X100 Pro Price: కెమెరా లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరలో వివో X100 ప్రో!

Vivo X100 Pro Price: కెమెరా లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరలో వివో X100 ప్రో!
Advertisement

Vivo X100 Pro Price: హై క్వాలిటీ ఫొటోలు తీసే బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకో గుడ్ న్యూస్. ప్రీమియం ఫీచర్లతో అలరిస్తున్న వివో X100 ప్రో ధరను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ విడుదల సమయంలో రూ.82,999 వద్ద లిస్ట్ చేయబడింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆప్షన్ ద్వారా వివో X100 ప్రోపై భారీ తగ్గింపును పొందొచ్చు.

ఈ Vivo X100 Pro.. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.82,999. అయితే, వివిధ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలిపితే ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై సుమారు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Advertisement

Also Read: వచ్చేస్తోంది గేమింగ్ బీస్ట్ ఐకూ 15R.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

ఇకపోతే మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే.. ఈ ఆఫర్ ద్వారా అదనంగా భారీ తగ్గింపును పొందవచ్చు. కాకపోతే మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే.. ఈ ఫోన్ ధర రూ.70వేల లోపే లభించే అవకాశం ఉంది.

Advertisement

Vivo X100 Proలో ZEISS ఆప్టిక్స్‌తో కూడిన 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ అలాగే 50 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా సెటప్‌ను అమర్చారు. దీంతో ఈ ఫోన్ ఫొటోగ్రఫీ ప్రేమికులకు అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు.

వివో  X100 Pro హ్యాండ్ సెట్ MediaTek Dimensity 9300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం Vivo X100 Pro మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న వివో X100 ప్రో.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
తక్కువ ధరలో ప్రీమియం కెమెరా ఫోన్ కావాలనుకునే వారు అమెజాన్ అందిస్తున్న ఈ బెస్ట్ డీల్‌ను మిస్ చేసుకోవద్దు.

Also Read: బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ నియో 8 ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు బాస్!

 

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×