E-Paper
Advertisement

Vivo X Fold 3 Pro Launch: 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వివో మ.. మ.. మ.. మడత ఫోన్.. ధర ఎంతంటే..?

Vivo X Fold 3 Pro Launch: 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వివో మ.. మ.. మ.. మడత ఫోన్.. ధర ఎంతంటే..?
Advertisement

Vivo X Fold 3 Pro Smart Phone Sale Date: వివో తన బ్రాండ్ నుంచి Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. Vivo ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అందుకు సంబందించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. Vivo X Fold 3 Pro ఫోల్డబుల్ మొబైల్ సెగ్మెంట్‌లో చాలా శక్తివంమైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌ను వివో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు తీసుకురానుంది. అయితే దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ భారతీయ వేరియంట్‌లో కంపెనీ ఏ ఫీచర్లను అందించగలదో ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్ దేశంలో లాంచ్ చేయడానికి వివో సిద్ధంగా ఉంది. కంపెనీ తన అధికారిక టీజర్‌ను కూడా విడుదల చేసింది. అంతే కాకుండా దీని కోసం ఒక మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైంది. కాబట్టి దీని స్పెసిఫికేషన్‌లను చైనీస్ వేరియంట్‌‌ను పోలి ఉంటాయి. చైనాలో Vivo X Fold 3 Pro ప్రారంభ ధర 9,999 యువాన్లు ఇండియా కరెన్సీలో సుమారు రూ. 1,17,000లగా ఉండవచ్చు.

Advertisement

Also Read: రియల్‌మీ P1 Pro 5G ఫోన్‌పై ఆఫర్ల వర్షం.. 24 గంటలే ఛాన్స్!

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే భారతీయ వేరియంట్‌లో 8.03-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. అయితే ఔటర్ డిస్‌ప్లే 6.53 అంగుళాలు ఉంటుంది. ఫోన్ మెయిన్ డిస్‌ప్లే 2,748 x 1,172 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉండవచ్చు. అయితే ఔటర్ డిస్‌ప్లే 2,480 x 2,200 పిక్సెల్ రిజల్యూషన్‌ను పొందవచ్చు. రెండు డిస్‌ప్లే‌లు LTPO టెక్నాలజీని కలగి ఉంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 4,500 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండవచ్చు.

Advertisement

Also Read: ప్రపంచంలోనే అతి చిన్న ఫ్లిప్ ఫోన్ లాంచ్.. దీని స్పెషల్ ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..!

Vivo X Fold 3 Pro స్మార్ట్‌‌ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ని ఫోన్‌లో ఇవ్వవచ్చు. దీనిలో 16GB LPDDR5 RAM, 1TB UFS 4.0తో ఇవ్వొచ్చు. ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,700mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 64మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో, వై-ఫై 7, ఎన్‌ఎఫ్‌సి సపోర్టును ఇందులో అందించవచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×