E-Paper
Advertisement

కొంపముంచిన చిప్‌ల కొరత.. వివో ఫోన్ల రేట్లు పెరిగాయి.. కొత్త ధరలు ఇవే!

కొంపముంచిన చిప్‌ల కొరత.. వివో ఫోన్ల రేట్లు పెరిగాయి.. కొత్త ధరలు ఇవే!
Advertisement

Vivo Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో షాకిచ్చింది. ఇండియాలో తమ పాపులర్ ఫోన్ల ధరలను వివో సైలెంట్‌గా పెంచేసింది. Vivo V70, V70 Elite, Y400, Y21 మోడళ్లపై ఏకంగా రూ.4వేల వరకు ధరలు పెరిగాయి. పెరిగిన కొత్త ధరలు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ధరల పెంపుపై కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ.. గ్లోబల్ మార్కెట్‌లో చిప్‌ల కొరతే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఏ ఫోన్ ధర ఎంత పెరిగింది?

ఈ సారి ధరల భారం ఎక్కువగా V సిరీస్ ఫోన్లపైనే పడింది. Vivo V70 Elite (8GB+256GB) వేరియంట్ ధర రూ.54,999 నుండి రూ.58,999కి చేరగా, 12GB వేరియంట్ ధర రూ.63,999కి పెరిగింది. అలాగే సాధారణ V70 మోడల్‌పై రూ.3వేల నుండి రూ.4వేల వరకు పెరిగింది. బడ్జెట్ రేంజ్ ఫోన్లయిన Vivo Y400 పై రూ.3వేలు, Vivo Y21పై రూ.వెయ్యి చొప్పున ధరలు పెరిగాయి.

ధరలు పెరగడానికి కారణం ఇదే:

Advertisement

ఈ ధరల పెంపునకు అసలు కారణం మెమొరీ చిప్‌ల కొరత. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు డిమాండ్ పెరగడంతో, చిప్ తయారీ సంస్థలు తమ దృష్టిని అటువైపు మళ్లించాయి. దీంతో స్మార్ట్‌ఫోన్లకు వాడే డ్రామ్ (DRAM), నాండ్ (NAND) చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా ఫోన్ల తయారీ ఖర్చు ఎక్కువై, కంపెనీలు ధరలు పెంచక తప్పడం లేదు.

Also Read: టైప్ చేసే పనిలేదు.. Google Gemini 3.5తో మాట్లాడితే చాలు, క్షణాల్లో 70 భాషల్లోకి అనువాదం!

తగ్గుతున్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు:

Advertisement

ఈ ఏడాది కేవలం వివో మాత్రమే కాదు.. దాదాపు ఎనిమిదికి పైగా మొబైల్ బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను పెంచాయి. నిరంతరం పెరుగుతున్న ఈ ధరల వల్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరలు భారీగా పెరుగుతుండటంతో కస్టమర్లు కొత్త ఫోన్లు కొనడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దాదాపు 9 శాతం మేర పడిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే?

ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ఇలాంటి సమయంలో, కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఆలస్యం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ కొనేటప్పుడు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు లేదా పండుగ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా కొంతవరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Also Read: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో హువావే కొత్త ఇయర్‌బడ్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్, రేటు ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×