E-Paper
Advertisement

Vivo V70, V70 Elite: 6500mAh బ్యాటరీ, ZEISS కెమెరాతో వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?

Vivo V70, V70 Elite: 6500mAh బ్యాటరీ, ZEISS కెమెరాతో వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?
Advertisement

Vivo V70, V70 Elite: వివో ఫోన్లు అంటేనే కెమెరా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్‌లో ఉంటుంది. గతేడాది వరుసగా రకరకాల మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చిన వివో.. ఇప్పుడు తన క్రేజీ V70 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా వివో V70తో పాటు వివో V70 ఇలైట్ అనే రెండు మోడల్స్ ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే సంస్థ అధికారికంగా చెప్పేసింది. ఇప్పుడీ V70 సిరీస్‌ యొక్క పూర్తి వివరాళ్లోకి వెళ్లిపోదాం రండి..

ఫొటోలు నెక్ట్స్ లెవల్..

ఈసారి వివో పర్ఫార్మెన్స్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. వివో V70 ఇలైట్ వేరియంట్‌లో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌ను వాడుతున్నారు. ఇక ఫొటోల విషయానికి వస్తే, ZEISS ట్యూనింగ్‌తో కూడిన సోనీ కెమెరాలు వీటి ప్రత్యేకత. వెనుక వైపు 3 కెమెరాలు ఉంటాయి. దానిలో 50MP మెయిన్ కెమెరాతో పాటు, దూరంగా ఉన్న వాటిని కూడా స్పష్టంగా ఫొటో తీయడానికి 3x ఆప్టికల్ జూమ్ ఉండే టెలిఫొటో లెన్స్‌ను కూడా ఇస్తున్నారు.

Advertisement

Also Read: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక..

మొబైల్ ఎంత వాడినా ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ ఇక అక్కర్లేదు. ఎందుకంటే.. ఈ ఫోన్లలో ఏకంగా 6500mAh పెద్ద బ్యాటరీని ఇస్తున్నారు. దీనికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే దీనిలో 6.59 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

ధర విషయానికి వస్తే..

Advertisement

వివో V70 సుమారు రూ.40,000 రేంజ్‌ ఉంటే.. ఇలైట్ మోడల్ రూ.50,000 ధరలో ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ల వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే.. నీళ్లలో తడిచినా లేదా దుమ్ము పట్టినా ఫోన్ సేఫ్‌గా ఉంటుందన్నమాట.

Also Read: తక్కువ ధరలో సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ అదిరిపోయింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×