E-Paper
Advertisement

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. వీవో నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్, ప్రైస్ కూడా తక్కువే!

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. వీవో నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్, ప్రైస్ కూడా తక్కువే!
Advertisement

Vivo V70 FE 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. తమ వినియోగదారుల కోసం అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. పాపులర్ V సిరీస్‌లో భాగంగా సరికొత్త ‘వీవో V70 FE’ ఫోన్‌ను ఏప్రిల్ 2న ఇండియన్ మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. మిడ్‌రేంజ్ ధరలోనే ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను అందిస్తుండటంతో ఈ ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఫోన్‌ ప్రత్యేకతేలంటో? ధర ఎంత ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆరేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్..

ఈ ఫోన్ చూడటానికే కాదు, వాడటానికి కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనిలో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. దీని బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇవ్వడం విశేషం.

కెమెరా అంటే వీవోనే..

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం వీవో ఈసారి ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను సెట్ చేసింది. దీనివల్ల ఎంత దూరం నుంచి తీసినా.. పిక్చర్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి తోడుగా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. దీంతో పగలే కాదు.. తక్కువ వెలుతురులో రాత్రిపూట కూడా ఈ ఫోన్‌తో అద్భుతమైన ఫొటోలు క్లిక్ చేయొచ్చు.

Also Read: భారీగా తగ్గిన ‘Samsung Galaxy Z Fold 7’ ధర.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడితే ఇంకా తక్కువకే!

ఛార్జింగ్ కష్టాలకు చెక్..

Advertisement

సాధారణంగా వివో స్మార్ట్‌ఫోన్లలో 5000mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఈ ఫోన్‌లో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరంగా వాడుకోవచ్చు. అయితే ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా.. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల గంటలోనే ఫోన్ ఫుల్‌ఛార్జ్ అయిపోతుంది.

కొత్త టెక్నాలజీతో డిజైన్..

ఈ ఫోన్ కలర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ముఖ్యంగా డార్క్‌నెస్ గ్లో అనే కొత్త టెక్నాలజీని దీనిలో వాడారు. తద్వారా చీకట్లో కూడా ఫోన్ వెనుక భాగం మెరుస్తూ కనిపిస్తుంది. ఇక నీటిలో పడినా పాడవకుండా ఉండేలా దీనికి ఐపీ రేటింగ్ కూడా ఇచ్చారు. అలాగే నీటి అడుగున ఫొటోలు తీసుకునే సదుపాయం కూడా ఈ ఫోన్‌లో ఉండటం విశేషం.

ధర ఎంతంటే?

ఈ వీవో V70 FE ఫోన్ సుమారు రూ.35వేల లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో విడుదల అయిన వెంటనే అమెజాన్, వీవో అఫీషియల్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. అద్భుతమైన కెమెరా, తిరుగులేని బ్యాటరీ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఆ చిన్న హోల్ ఎందుకో తెలిస్తే.. పొరపాటున కూడా పిన్ను పెట్టరు!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×