E-Paper
Advertisement

7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!

7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!
Advertisement

Vivo V70 FE Price Cut: ప్రముఖ మొబైల్ సంస్థ వివో తమ V70 FE 5G మోడల్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. జులైలో విడుదలైన ఈ ఫోన్.. ఆకర్షణీయమైన లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ధర గణనీయంగా తగ్గడంతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

ధర ఎంత తగ్గింది?

Vivo V70 FE 5G అసలు ధర రూ.53,999 కాగా.. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో దాదాపు 28 శాతం తగ్గింపుతో రూ.38,999లకే అందుబాటులో ఉంది. దీనికి తోడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గి, వినియోగదారులకు చాలా లాభదాయకంగా మారుతుంది.

Advertisement

Also Read: గేమర్స్ బీ రెడీ.. రూ.11 వేలకే 280Hz రిఫ్రెష్ రేట్.. లెనోవో కొత్త గేమింగ్ మానిటర్ చూశారా?

మెరుగైన పనితీరు:

ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే గేమింగ్, మల్టీటాస్కింగ్ సులువుగా సాగేందుకు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై పనిచేస్తుంది.

బ్యాటరీ లైఫ్ ఎంతంటే?

Advertisement

ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఇందులో 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇక రోజంతా హ్యాపీగా వాడేందుకు ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు ఉన్న IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు దీనికి మరింత రక్షణనిస్తాయి.

Also Read: ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Vivo X300e.. పిచ్చెక్కించే లీక్డ్ ఫీచర్లు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×