E-Paper
Advertisement

ఈ ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు.. సింగిల్ ఛార్జ్‌తో 55 గంటలు రన్ అయ్యే వివో కొత్త ఇయర్‌బడ్స్!

ఈ ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు.. సింగిల్ ఛార్జ్‌తో 55 గంటలు రన్ అయ్యే వివో కొత్త ఇయర్‌బడ్స్!
Advertisement

Vivo TWS 5e: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ సరికొత్త ఇయర్‌బడ్స్ Vivo TWS 5eను చైనా మార్కెట్లో విడుదల చేసింది. Vivo S60 ఫోన్‌తో పాటు లాంచ్ అయిన ఈ ఇయర్‌బడ్స్.. పాత మోడల్స్ కంటే మెరుగైన ఫీచర్లతో వచ్చాయి. ముఖ్యంగా డిజైన్, బ్యాటరీ లైఫ్ విషయంలో కంపెనీ చాలా మార్పులు చేసింది.

బడ్జెట్ ధరలోనే..

ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ ధరను చైనాలో 229 యువాన్లుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 3,200 రూపాయలుగా ఉంటుంది. ఇవి ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల కోసం వీటిని ఇంక్ బ్లాక్, వైట్, తియాన్‌క్వింగ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చారు.

Advertisement

Also Read: AC నుంచి వాటర్ లీక్ అవుతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫిక్స్ చేసే 4 ట్రిక్స్ ఇవిగో!

అద్భుతమైన ఆడియో క్వాలిటీ..

సంగీత ప్రియులను అలరించేలా ఇందులో 11 మిమీ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి ఏఏసీ, ఎస్‌బీసీ, ఎల్‌సీ3 వంటి ఆడియో కోడెక్స్‌ను సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా.. వివో ప్రత్యేకమైన డీప్‌ఎక్స్ 3.0 స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్, స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఇందులో ఉన్నాయి. దీనివల్ల పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది.

మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్..

Advertisement

Vivo TWS 5eలోని 55 డెసిబెల్స్ హైబ్రిడ్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది చుట్టుపక్కల ఉండే శబ్దాలను బట్టి ఆటోమేటిక్‌గా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రయాణాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

55 గంటల ప్లేబ్యాక్..

కనెక్టివిటీ కోసం ఈ బడ్స్‌లో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వర్షన్‌ను అందించారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 13 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి వాడుకుంటే ఏకంగా 55 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. గేమింగ్ ఆడేవారి కోసం కేవలం 42 మిల్లీసెకన్ల లో లేటెన్సీ మోడ్‌ను కూడా ఇందులో చేర్చారు.

Also Read: వావ్.. రాత్రిపూట ఏసీని Sleep Modeలో పెడితే.. కరెంట్ బిల్లు ఇంతలా తగ్గుతుందా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×