E-Paper
Advertisement

9,020mAh బ్యాటరీ, 4k వీడియో రికార్డింగ్ కెమెరా.. Vivo T5 Pro 5G ఫోన్ లాంచ్!

9,020mAh బ్యాటరీ, 4k వీడియో రికార్డింగ్ కెమెరా.. Vivo T5 Pro 5G ఫోన్ లాంచ్!
Advertisement

Vivo T5 Pro 5G: వీవో T5 సిరీస్‌లో రెండో ఫోన్‌గా T5 ప్రో 5Gని బుధవారం భారత మార్కెట్ లో లాంచ్ అయింది. ఏప్రిల్ 21న ఫ్లిప్ కార్ట్, వీవో ఆన్‌లైన్ స్టోర్ లో సేల్స్ స్టార్ట్ అవుతాయి. న్యూ వీవో T5 ప్రో 5G టు కలర్స్, త్రీ RAM, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. 9,020mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా ఉండే ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

వీవో టీ5 ప్రో 5జీ ధర, ఆఫర్లు

వీవో టీ5 ప్రో 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 29,999 నుంచి స్టార్ అవుతుంది. ఇందులో 8GB RAM, 128GB స్టోరేజీ ఉంటుంది. ఇందులో, హై ఎండ్ 8GB RAM + 256 GB స్టోరేజీ కాన్ఫిగరేషన్ ధర రూ. 33,999గా ఉంది. చివరగా, 12GB RAM, 256 GB స్టోరేజీ ఫోన్ ధర రూ. 39,999. అయితే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులపై రూ. 3,000 వరకు బ్యాంకు డిస్కౌంట్‌, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. వీవో ఫోన్లపై రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అందిస్తుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, వీవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగులలో లభిస్తుంది.

వీవో టీ5 ప్రో 5జీ ఫోన్ ఫీచర్లు

Advertisement

వీవో T5 ప్రో 5G ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్‌ఓఎస్ 16 పై పనిచేసే డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే స్క్రీన్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్, 2,160Hz PWM డిమ్మింగ్, 449 ppi పిక్సెల్ డెన్సిటీ, స్లీప్ కంఫర్ట్ మోడ్, యాంటీ మోషన్ సిక్‌నెస్ మోడ్‌తో బ్లూ లైట్, ఫ్లికర్ సర్టిఫికేషన్‌లతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది.

మరిన్నీ ఫీచర్లు

ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్
వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్
12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్

కెమెరా ఫీచర్లు

Advertisement

ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ రియర్ కెమెరాతో లభిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ లో 9,020mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను సపోర్టు చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×