E-Paper
Advertisement

Viral News: ఏం తెలివి గురూ.. పాత ల్యాప్‌టాప్ బ్యాటరీలతో ఇంటికి కరెంట్.. ఐడియా అదుర్స్!

Viral News: ఏం తెలివి గురూ.. పాత ల్యాప్‌టాప్ బ్యాటరీలతో ఇంటికి కరెంట్.. ఐడియా అదుర్స్!
Advertisement

అనవసర వస్తువుల నుంచి క్రేజీ వస్తువులను తయారు చేయడం తరచుగా చూస్తుంటాం. ప్లాస్టిక్ నుంచి చక్కటి కళాఖండాలు, వేస్ట్ న్యూస్ పేపర్ నుంచి రకరకాల కటింగ్స్, కొబ్బరి పీచు, చిప్పలతో బొమ్మలు, పగిలిన గాజులతో దండలు తయారు చేయడం చూసే ఉంటాం. కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే, పనికి రాని వస్తువులతో కూడా పనికి వచ్చే పనులు చేయవచ్చు అని నిరూపించాడు గ్లూబక్స్ అనే వ్యక్తి. ఆయన చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. బయటి నుంచి కరెంట్ కనెక్షన్ లేకుండా తన ఇంటికి కరెంటు ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఆయన.. చివరకు అనుకున్నది సాధించాడు. ఇంతకీ ఆయన తన గోల్ ఎలా రీచ్ అయ్యాడంటే..

పాత ల్యాప్ టాప్ బ్యాటరీలను ఉపయోగించి..

2016లో గ్లూబక్స్ ఓ క్రేజీ ప్లాన్ చేశాడు. ఖరీదైన బ్యాటరీలను కొనడానికి బదులుగా, ప్రజలు పారవేసే పాత ల్యాప్‌ టాప్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించి కరెంట్ తయారు చేయాలనుకున్నాడు. చాలా ట్యాప్ టాప్ లను బాగాలేవని పడేసినా, వాటిలోని బ్యాటరీగా హెల్దీగా ఉన్నట్లు గుర్తించాడు. సుమారు 1,000కి పైగా పాత ల్యాప్‌ టాప్ బ్యాటరీ ప్యాక్‌ లను సేకరించాడు.   ప్రతి ప్యాక్‌ ఓపెన్ చేసి, హెల్దీగా ఉన్న సెల్స్ ను తీసుకున్నాడు. అన్ని బ్యాటరీ సెల్స్ బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని కలిపి ‘పవర్‌ వాల్స్’ అని పిలిచే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ను ఏర్పాటు చేశాడు. ఇంటికి ఏమాత్రం ఇబ్బంది కలగుండా ఇంటి నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేక షెడ్‌ లో అన్ని బ్యాటరీ ప్యాక్ లను ఉంచాడు. షెడ్‌ లో మంచి వెంటిలేషన్, బ్యాటరీ రాక్‌ల కోసం స్థలం ఏర్పాటు చేశాడు.

పవర్ వాల్స్ కు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు

Advertisement

అటు గ్లూబక్స్ ఇంటికి కరెంటు కోసం బ్యాటరీల మీద మాత్రమే ఆధారపడలేదు. అతడు 24 హై అవుట్‌ పుట్ సోలార్ ప్యానెల్‌ లను ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కటి దాదాపు 440 వాట్ల పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. పగటిపూట, సోలార్ ప్యానెల్స్ బ్యాటరీ బ్యాంక్‌ ను ఛార్జ్ చేస్తాయి. రాత్రిపూట, నిల్వ చేయబడిన ఛార్జింగ్ తో ఇంట్లో కరెంటు ఉపయోగించడం మొదలు పెట్టారు.

ఏ సమస్య లేకుండా 8 సంవత్సరాల ఉపయోగం

చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, అతడు రూపొందించిన ఈ బ్యాటరీ పవర్ సిస్టమ్ ఎనిమిది సంవత్సరాల పాటు పని చేసింది. ఆ సమయంలో ఒక్క బ్యాటరీ సెల్‌ను కూడా మార్చలేదని చెప్పాడు. మంటలు రావడం, బ్యాటరీలు ఉబ్బడం లాంటి సమస్యలు కూడా ఎదురు కాలేదన్నారు. అతడు జాగ్రత్తగా మంచి సెల్స్ ఎంచుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పాడు. ప్రారంభంలో, అతడి బ్యాటరీ బ్యాంక్ దాదాపు 7 kWh పవర్ ను నిల్వ చేసింది. ఆ తర్వాత దాన్ని దాదాపు 56 kWhకి పెంచాడు. ఇది శీతాకాలంలో కూడాగృహ అవసరాలను సౌకర్యవంతంగా పవర్ సప్లై చేసేలా రూపొందించాడు. గ్లూబక్స్ స్మార్ట్ రీసైక్లింగ్‌ కు బెస్ట్ ఎగ్జాంపుల్ గా దీనిని రూపొందించాడు.

Advertisement

Read Also: అడల్ట్ కంటెంట్లు.. పైరసీ సినిమాలు.. బెట్టింగ్ లింకులు.. అడ్డమైన పనులకు అడ్డ టెలిగ్రామ్, వాళ్లను అడ్డుకోలేరా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×