E-Paper
Advertisement

అబ్బా ఏం ఆఫర్లు రా బాబు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 65 శాతం డిస్కౌంట్!

అబ్బా ఏం ఆఫర్లు రా బాబు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 65 శాతం డిస్కౌంట్!
Advertisement

Vijay Sales Sale 2026: కొత్త గ్యాడ్జెట్లు లేదా హోమ్ అప్లయెన్సెస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక మంచి అవకాశం వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ సంస్థ విజయ్ సేల్స్ Grand Electronics Sale 2026ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్‌పై ఏకంగా 65% వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. కస్టమర్లు విజయ్ సేల్స్ స్టోర్స్‌తో పాటు వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై సూపర్ డీల్స్:

ఈ సేల్‌లో బడ్జెట్ ధరలోనే 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.11,499 ప్రారంభ ధర నుంచే ప్రముఖ బ్రాండ్ల 5G ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఇక హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ, మినీ ఎల్‌ఈడీ వంటి అత్యాధునిక స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు ఉంది.

ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్:

Advertisement

విద్యార్థులు, ఉద్యోగుల కోసం ల్యాప్‌టాప్‌లపై 40% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. గేమింగ్ ప్రియుల కోసం పవర్‌ఫుల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు రూ.70,990 ప్రారంభ ధరతో సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇంటికి అవసరమైన ఏసీలు రూ.28,490, వాషింగ్ మెషీన్లు రూ.10,990, రిఫ్రిజిరేటర్లు రూ.9,490 ప్రారంభ ధరలకే లభిస్తున్నాయి.

Also Read: గేమర్స్‌కు బంపర్ ఆఫర్.. కొత్త Alienware ల్యాప్‌టాప్ కొంటే రూ.22 వేల మానిటర్ సగం ధరకే!

కిచెన్ ప్రొడక్ట్స్, గ్యాడ్జెట్స్:

Advertisement

వంటగదిని స్మార్ట్‌గా మార్చుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్లు రూ.2,799, మైక్రోవేవ్ ఓవెన్లు రూ.6,490, అలాగే కుక్‌టాప్స్, చిమ్నీలు రూ.1,299 ప్రారంభ ధరల నుంచే లభిస్తున్నాయి. వీటితో పాటు స్మార్ట్‌వాచ్‌లు రూ.1,299, ఆడియో గ్యాడ్జెట్లు రూ.499, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ రూ.549కే అందుబాటులో ఉన్నాయి.

రూ.20,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రముఖ బ్యాంక్ కార్డులపై రూ.20వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఈఎంఐ ఆఫర్లు లభిస్తాయి. అలాగే మై వీఎస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 0.75 శాతం రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. తక్కువ ధరలో ఎక్కువ వస్తువులు కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ నిజంగానే ఒక మంచి అవకాశం.

Also Read: రెడ్ కలర్‌లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్‌లోనే లభ్యం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×