E-Paper
Advertisement

iPhone 17 సిరీస్‌పై ఊహించని డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్ పూర్తి వివరాలివే!

iPhone 17 సిరీస్‌పై ఊహించని డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్ పూర్తి వివరాలివే!
Advertisement

iPhone 17 Offers: ఏదైనా మంచి ఆఫర్‌లో యాపిల్ ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ లాంటిది. ప్రముఖ రిటైల్ సంస్థ విజయ్ సేల్స్ ‘యాపిల్ డేస్’ సేల్‌ను మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 16 వరకు నడుస్తుంది. సాధారణంగా చిప్స్ కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. కానీ విజయ్ సేల్స్ మాత్రం తమ కస్టమర్ల కోసం ఐఫోన్లు, ఐప్యాడ్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాల్లోని విజయ్ సేల్స్ స్టోర్లలో గానీ లేదంటే వారి వెబ్‌సైట్‌లో గానీ ఈ ఆఫర్ల వివరాలను చూడొచ్చు.

లేటెస్ట్ iPhone 17 మోడల్స్‌పై భారీ తగ్గింపు..

ఈ సేల్‌లో అందరి కళ్లూ ఐఫోన్ 17 సిరీస్‌పైనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన iPhone 17 ధర రూ.78,790 నుంచి మొదలవుతోంది. దీనికి తోడు యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్స్ వాడేవారికి మరో రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇక iPhone 17e మోడల్ అయితే రూ.60,490కే వచ్చేస్తోంది. మీరు ఇంకాస్త హైఎండ్ ఫోన్ కావాలనుకుంటే.. iPhone 17 Pro రూ.1,24,190కి, iPhone 17 Pro Max రూ.1,38,390కే అందుబాటులో ఉన్నాయి. ఇక స్లిమ్ లుక్‌తో వచ్చే iPhone Air ధర రూ.90,990గా నిర్ణయించారు.

Advertisement

Also Read: ఏందీ.. ఏసీలపై 65% డిస్కౌంటా? ఈ అమెజాన్ ధమాకా సేల్‌ను మిస్ చేసుకుంటే ఇంకెప్పుడూ కొనలేరు!

పాత మోడళ్లపై కూడా క్రేజీ డీల్స్..

కేవలం కొత్త ఫోన్లే కాదు.. iPhone 16, 15 మోడళ్లపై కూడా ధరలు బాగా తగ్గాయి. iPhone 16 ఎఫెక్టివ్ ధర రూ.64,490కి దిగివచ్చింది. ఇక బడ్జెట్‌లో యాపిల్ ఫోన్ వాడాలనుకునే వారికి iPhone 15 ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక అన్ని ఆఫర్లు పోను ఇది రూ.54,900కే లభిస్తోంది.

ఐప్యాడ్లు 20% తగ్గింపు..

Advertisement

ఫోన్లే కాదు.. ఐప్యాడ్ ప్రియులకు కూడా పండగే. ఐప్యాడ్ 11వ జనరేషన్ రూ.30,490కే దొరుకుతుండగా.. లేటెస్ట్ ఎం4, ఎం5 చిప్ ఉన్న ఐప్యాడ్ ఎయిర్, ప్రో మోడళ్లపై కూడా వేలల్లో డిస్కౌంట్లు ఉన్నాయి. వీటితో పాటు పాత ఫోన్ ఇస్తే రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, యాపిల్ కేర్ ప్లస్‌పై 20 శాతం తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఇక విజయ్ సేల్స్ లాయల్టీ పాయింట్స్ ఎలాగూ ఉంటాయి. కాబట్టి.. యాపిల్ ప్రొడక్ట్ కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ రాదనే చెప్పాలి.

Also Read: నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×