E-Paper
Advertisement

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్, ఫేస్‌బుక్‌ లాగిన్ కోసం.. క్రేజీ టెక్నాలజీ!

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్, ఫేస్‌బుక్‌ లాగిన్ కోసం.. క్రేజీ టెక్నాలజీ!
Advertisement

Vi Silent Verification: టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల కోసం అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా ‘సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్’ (Silent Mobile Verification – SMV) విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘మెటా’ (Meta) భాగస్వామ్యంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో లాగిన్ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేసేందుకు ఉపయోగపడనుంది. ఇంతకీ ఎస్ఎంవీ విధానం ఎలా పనిచేస్తుంది? దీని వల్ల వీఐ యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీపీల గోల ఉండదు

సాధారణంగా ఏదైనా యాప్‌లో లాగిన్ అవ్వాలన్నా లేదా కొత్త అకౌంట్ తెరవాలన్నా మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్ చేయాల్సిందే. కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల వల్ల ఈ ఓటీపీలు టైంకు రాకుండా చికాకు తెప్పిస్తుంటాయి. అయితే వీఐ తీసుకొచ్చిన ఈ ‘సైలెంట్ వెరిఫికేషన్’ ద్వారా ఫోన్ నంబర్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతుంది. ఎలాంటి కోడ్‌లను ఎంటర్ చేయాల్సిన పనిలేకుండానే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో లాగిన్ అవ్వొచ్చని వీఐ వర్గాలు తెలిపాయి.

సైబర్ మోసాలకు అడ్డుకట్ట

Advertisement

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరస్తులను ఈ ఓటీపీ విధానాన్ని తమకు అనుకులంగా మార్చుకొని అమాయకులను బురిడి కొట్టిస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఓటీపీలను దొంగిలించి బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసే ఘటనలు ఎక్కువైపోయాయి. వీఐ తీసుకొచ్చిన ఈ సైలెంట్ వెరిఫికేషన్ పద్ధతిలో మొబైల్ నంబర్ నేరుగా టెలికాం నెట్‌వర్క్ సహాయంతోనే అథెంటికేట్ అవుతుంది. దీంతో యూజర్ చేతుల్లో ఎలాంటి ఓటీపీ నంబర్ ఉండదు. కాబట్టి హ్యాకర్లు మోసం చేసి కోడ్‌లను దొంగిలించే అవకాశం అస్సలు ఉండదని వీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: హార్డ్ vs సాఫ్ట్.. ఖరీదైన స్మార్ట్ ఫోన్‌కు.. ఏ కవర్ శ్రీరామరక్ష?

జెట్ వేగంతో లాగిన్

Advertisement

మరోవైపు ‘సైలెంట్ వెరిఫికేషన్’ ప్రక్రియతో మెటా యాప్స్ లో లాగిన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఖాతా పునరుద్ధరణ, కొత్త అకౌంట్ రిజిస్ట్రేషన్, రీ-లాగిన్ అయ్యే సమయాల్లో మెసేజ్ కోసం వేచి చూడడం వంటి సమస్యలు ఇకపై వీఐ యూజర్లకు ఉండవు. కేవలం 2 నుండి 4 సెకన్లలోనే లాగిన్ ప్రక్రియ పూర్తి కావడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా చాలా వేగంగా సోషల్ మీడియా యాప్స్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు కూడా ఇలాంటి టెక్నాలజీని ప్రవేశపెడితే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Also Read: స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను ఎలా పడితే అలా తుడుస్తున్నారా? అయ్య బాబోయ్ ఇక కొంపమునిగినట్టే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×