E-Paper
Advertisement

వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!

వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!
Advertisement

Vi Rs 3699 Plan: వోడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. అయితే పదే పదే రీఛార్జ్ చేయాల్సిన పని లేకుండా ఒకేసారి ఏడాది మెుత్తం డేటా, కాలింగ్, ఓటీటీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోరుకునేవారి కోసం వీఐ ఓ సాలిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.3,699 ధరలో తీసుకొచ్చిన ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రూ.3699 ప్లాన్ ప్రత్యేకతలు

వీఐ ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రూ.3,699 ప్లాన్ ను ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పొడవునా దీని బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రతీ రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభిస్తాయి. అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

అదనపు ప్రయోజనాలు..

Advertisement

రూ.3,699 ప్లాన్ తో వీఐ అందిస్తున్న ఎక్స్ క్లూజివ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు. ‘బింజ్ ఆల్ నైట్’ కింద అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి డేటా పరిమితి లేకుండా అపరిమితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్’ ద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉపయోగించకుండా మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు. వీటితో పాటు డేటా డిలైట్స్ అందించే 2 GB వరకు ఫ్రీ బ్యాకప్ డేటాను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ఎవరికి బెనిఫిట్?

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రికెట్ లైవ్స్ ఎక్కువగా చూసేవారు.. హాట్ స్టార్ వల్ల మంచి బెనిఫిట్ పొందొచ్చు. రాత్రి వేళల్లో ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారికి, విద్యార్థులకు ‘బింజ్ ఆల్ నైట్’ ఫీచర్ ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రతి నెలా రీఛార్జ్ గుర్తుపెట్టుకునే గోల లేకుండా ఏడాది అంతా నిశ్చింతగా ఉండాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై పీకే కన్ను, ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్

ఎలా రీఛార్జ్ చేయాలి?

ఈ ప్లాన్‌ను చాలా ఈజీ పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్‌లోని ‘Vi App’ లేదంటే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నంబర్ ఎంటర్ చేసి రూ. 3,699 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లి దీనిని సొంతం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కుదరని పక్షంలో సమీపంలోని రిటైల్ షాపుకు వెళ్లి కూడా ప్లాన్ గురించి చెప్పి నేరుగా రీఛార్జ్ పొందొచ్చు.

Also Read: పోర్ట్రోనిక్స్ డాష్ 4 పార్టీ స్పీకర్.. తక్కువ ధరలో అద్భుతమైన సౌండ్!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×