E-Paper
Advertisement

వీఐ ధమాకా ప్లాన్.. 3,500 GB డేటా, 20+ OTTలు ఫ్రీ.. మూవీ లవర్స్‌కు పండగే!

వీఐ ధమాకా ప్లాన్.. 3,500 GB డేటా, 20+ OTTలు ఫ్రీ.. మూవీ లవర్స్‌కు పండగే!
Advertisement

Vi Broadband Plan: ఎయిర్ టెల్, జియోల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వోడాఫోన్ ఐడియా (Vi) సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా రూ.1297 ధరతో ఒక అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు భారీ ఓటీటీ ప్రయోజనాలను కోరుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.1297 ప్లాన్ బెనిఫిట్స్..

ఈ రూ. 1297 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతి నెలా 3.5 TB (3500 GB) వరకు ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా లభిస్తుంది. ఒకవేళ ఈ 3.5 TB పరిమితి ముగిసిపోయినప్పటికీ ఇంటర్నెట్ ఆగిపోదు. కాకపోతే స్పీడ్ మాత్రం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది ఫైబర్ ఆధారిత కనెక్టివిటీ కావడంతో వినియోగదారులకు అత్యంత స్థిరమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అనుభూతి లభిస్తుందని వీఐ వర్గాలు చెబుతున్నాయి.

20కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు!

Advertisement

ఈ ప్లాన్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్ గా ఓటీటీ బెనిఫిట్స్ నిలుస్తున్నాయి. రూ.1297 ప్లాన్ తీసుకునే వారికి ఉచితంగా ‘వీఐ మూవీస్ అండ్ టీవీ’ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. దీని ద్వారా వినియోగదారులు ఏకంగా 20కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. హాట్ స్టార్, సోనీ లైవ్, జీ5, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, టైమ్స్ ప్లే, యప్ టీవీ తదితర ఓటీటీలను పైసా ఖర్చు లేకుంగా వీక్షించవచ్చు.

Also Read: సింగరేణిని ‘ATM’లా వాడి.. రూ.50 వేల కోట్ల బాకీ పెట్టారు.. కాంగ్రెస్, BRSలపై కిషన్ రెడ్డి ఫైర్!

అందులో వెనుకబడ్డ వీఐ..

Advertisement

అయితే మార్కెట్లో గట్టి పోటీనిస్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లతో పోలిస్తే Vi ఇప్పటికీ చాలా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే డేటా స్పీడ్ విషయంలో వీఐ వెనుకంజలో ఉంది. 500 Mbps లేదా 1 Gbps ప్లాన్లు Vi వద్ద ఇప్పటికీ లేవు. జియో, ఎయిర్‌టెల్‌లు అంతకంటే ఎక్కువ వేగవంతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తూ బ్రాడ్ బ్యాండ్ విభాగంలోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.

Also Read: వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×