E-Paper
Advertisement

అతిపెద్ద పామును గుర్తించిన పరిశోధకులు.. పొడవెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

అతిపెద్ద పామును గుర్తించిన పరిశోధకులు.. పొడవెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
Advertisement

Vasuki Indicus Fossil: భారతీయ శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని గుర్తించారు. దేశంలోనే అత్యంత పొడవైన పామును గుర్తించారు. 47 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఈ భారీ పురాతన పాముకు సంబంధించిన శిలాజాలను తాజాగా గుర్తించారు. ఈ పాముకు వాసుకి ఇండికస్గా నామకరణం చేశారు. దీని పొడవు సుమారు 36 అడుగుల నుండి 50 అడుగుల వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

 గుజరాత్ లో గుర్తించిన శాస్త్రవేత్తలు

ఈ భారీ పాము శిలాజాలను గుజరాత్ ప్రాంతంలో ఉన్న కచ్‌ లోని పనంధ్రో లిగ్నైట్ గనుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిశోధకులు దేబాజిత్ దత్తా, సునీల్ బాజ్‌ పాయ్ నేతృత్వంలోని బృందం మొత్తం 27 వెన్నుపూసలను గుర్తించి విశ్లేషించారు. కొన్ని ఎముకలు ఇంకా సహజ స్థితిలో ఉండటంతో, పాము పరిమాణాన్ని అంచనా వేయడం ఈజీ అవుతుందన్నారు. వాసుకి ఇండికస్ అనే పేరు హిందూ పురాణాలలోని శక్తివంతమైన సర్పం వాసుకి పేరు మీద పెట్టినట్లు చెప్పారు. ఇది మన దేశంలో కనుగొన్నందుకు గౌరవ సూచకంగా ఈ పేరు ఎంపిక చేశారు.

సుమారు 15 మీటర్ల పొడవైన పాము

Advertisement

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ పాము వెన్నుపూసలు చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని ఎముకలు 4 అంగుళాల కంటే ఎక్కువ వెడల్పు కలిగి ఉండటం విశేషం. మొత్తం నిర్మాణాన్ని ఆధారంగా తీసుకుని, ఈ పాము దాదాపు 15 మీటర్లు అంటే, సుమారు 50 అడుగుల పొడవు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద పాముల్లో ఒకటి

ఈ పరిమాణం వల్ల వాసుకి ఇండికస్ ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద పాములలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ప్రసిద్ధమైన పురాతన పాము టైటానోబోవాతో సమానంగా, కొన్ని సందర్భాల్లో దానికంటే పెద్దదిగా కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే పూర్తి అస్థిపంజరం లభించకపోవడంతో కచ్చితమైన అంచనాకు రాలేదు. ఇంకా పరిశోధన కొనసాగిస్తున్నారు.

Advertisement

ఇంత పెద్ద శరీరం ఉన్న పాము వేగంగా కదలడం సాధ్యంకాదు అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆధునిక అనకొండల మాదిరిగానే, ఎర దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే దాడి చేసే విధంగా జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కనిపించే అతిపెద్ద పాములు అయిన రెటిక్యులేటెడ్ పైథాన్లు, సాధారణంగా 25 నుంచి 30 అడుగుల వరకు మాత్రమే పెరుగుతాయి. వాటితో పోలిస్తే వాసుకి ఇండికస్ దాదాపు రెండింతల పరిమాణంలో ఉంటుంది. బరువు కూడా ఒక టన్ను వరకు ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పాము మాడ్ట్సోయిడే కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. ఈ కుటుంబం సుమారు 100 మిలియన్ సంవత్సరాల పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జీవించింది. ఆఫ్రికా, యూరప్,  భారత్ లాంటి ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లు కనిపించాయి.

మొత్తంగా, వాసుకి ఇండికస్ ఆవిష్కరణ పురాతన జీవజాలంపై అవగాహనను మరింత పెరిగేలా చేసింది. భూమిపై ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న జీవులు ఎంత వైవిధ్యంగా, అద్భుతంగా ఉండేవో ఈ శిలాజం మరోసారి నిరూపించింది.

Read Also: మండుతున్న చికెన్ ధరలు.. కిలో రూ.360 దాటిన స్కిన్‌ లెస్ చికెన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×