E-Paper
Advertisement

అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్.. ఏసీ పెట్టేందుకు నిరాకరిస్తే.. ఓనర్లకు రూ.94,904 జరిమానా!

అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్.. ఏసీ పెట్టేందుకు నిరాకరిస్తే.. ఓనర్లకు రూ.94,904 జరిమానా!
Advertisement

AC Rules: వేసవి కాలంలో ఏసీల అవసరం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సొంతింటివారు ఎవరి అనుమతితో పనిలేకుండా ఏసీలను తమ ఇళ్లకు అమర్చుకుంటారు. కానీ అద్దె ఇంట్లో నివసించే వారికి కొన్ని సందర్భాల్లో ఈ స్వేచ్ఛ ఉండదు. కొందరు ఇంటి యజమానులు.. ఏసీ పెట్టేందుకు అస్సలు ఒప్పుకోని ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారికి షాకిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఏసీ సౌకర్యానికి నిరాకరిస్తే భారీగా జరిమానా విధించేలా కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని ప్రముఖ తీర ప్రాంత నగరం వాంకోవర్.. ఇంటి యజమానులకు షాకిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏసీ పెట్టనివ్వకుండా ఇంటి యజమనులు అడ్డుకుంటే వారికి 1000 డాలర్ల జరిమానా (భారత కరెన్సీ ప్రకారం రూ.94,904) విధిస్తామని స్థానిక అధికారులు హెచ్చరించారు. కొత్త నిబంధనల ప్రకారం.. అద్దెదారులు తమ స్వంత ఖర్చులతో లేదా నిబంధనల ప్రకారం ఏసీని ఏర్పాటు చేసుకుంటామని కోరినప్పుడు యజమానులు దానికి అడ్డుచెప్పకూడదని స్పష్టం చేశారు.

Advertisement

వాంకోవర్.. కెనడాలోని అత్యంత వెచ్చని నగరాల్లో ఒఖటి. తీరానికి ఆనుకోని ఉండటంతో అక్కడ ప్రస్తుతం భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే ఏసీలు పెట్టుకునేందుకు ఇంటి యజమనులు ఒప్పుకోవడం లేదని.. అక్కడి అద్దెదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అద్దెదారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని వాంకోవర్ యంత్రాంగం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దె గృహాలు, లీజు, రెంటింగ్ ఒప్పందం ఉన్న అన్ని రకాల నివాసాలకు ఇది వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!

Advertisement

అయితే అద్దెదారులకు సైతం స్థానిక అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఏసీని అమర్చేటప్పుడు ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, సురక్షితమైన పద్ధతుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏసీ వినియోగానికి అయ్యే అదనపు కరెంట్ బిల్లును అద్దెదారులే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు ఇల్లు పాత బడి ఉండి, సరైన కండిషన్ లేని పరిస్థితుల్లో ఏసీ పెట్టేందుకు నిరాకరించే వెసులుబాటును ఓనర్లకు సైతం కల్పించారు. ఇదిలా ఉంటే అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఒరెగాన్ లలో ఈ తరహా నిబంధనలనే అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. పోర్టబుల్ కూలింగ్ పరికరాలు వాడకుండా అడ్డుకునే హక్కు ఇంటి యజమానులకు లేవని తేల్చి చెప్పాయి.

Also Read: సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×