E-Paper
Advertisement

Valentine’s Day sale 2026: ఇదే సరైన సమయం.. ఐఫోన్ 17 సిరీస్‌పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు, మిస్ అవ్వకండి!

Valentine’s Day sale 2026: ఇదే సరైన సమయం.. ఐఫోన్ 17 సిరీస్‌పై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు, మిస్ అవ్వకండి!
Advertisement

Valentine’s Day sale 2026: వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు ఆఫర్లో లభించే ఐఫో‌నే కానుకగా ఇచ్చేయండి. ప్రస్తుతం మార్కెట్లో టాప్‌లో ఉన్న iPhone 17 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు విజయ్ సేల్స్, క్రోమా వంటి ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ సేల్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ స్టోర్‌లో ఎంత ధరకు ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో, వాటి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

iPhone 17

ఐఫోన్ 17 సిరీస్‌లో బేస్ మోడలైన దీనిపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. విజయ్ సేల్స్‌లో దీని ధర రూ.75,000కి తగ్గింది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.77,900కు లభిస్తుండగా, క్రోమాలో రూ.82,900 ధరతో ఉంది. ఐఫోన్ 17 ఫోన్ A18 చిప్‌తో లభిస్తుంది. ఇది పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. తొలిసారిగా బేస్ మోడల్‌లో కూడా 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేను అందించడం విశేషం.

Advertisement

Also Read: రూ.12,600కే 50MP కెమెరా, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి కొత్త 5G ఫోన్ విడుదల!

iPhone 17 Pro

ప్రొఫెషనల్ ఫీచర్లు కోరుకునే వారికి ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. విజయ్ సేల్స్‌లో దీనిని రూ.1,28,490కే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్‌లో రూ.1,30,490 ధర ఉండగా, క్రోమాలో రూ.1,34,900కు లభిస్తోంది. దీనిలో అత్యాధునిక A19 ప్రో ప్రాసెసర్, 5x టెలిఫొటో లెన్స్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్ ఉంది.

iPhone 17 Pro Max

Advertisement

ఐఫోన్ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడలైన ప్రో మాక్స్‌పై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. విజయ్ సేల్స్‌లో దీని ధర రూ.1,43,900కు తగ్గింది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో దీని ధర రూ.1,45,900 ఉండగా, క్రోమాలో రూ.1,49,900కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్, ప్రొఫెషనల్ వీడియో రికార్డింగ్ ఫీచర్లతో లభిస్తుంది.

మరిన్ని ఆఫర్లు:

ఈ ధరలు మాత్రమే కాకుండా బ్యాంక్ కార్డ్‌లపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనంగా వేల రూపాయల తగ్గింపు పొందే అవకాశం ఉంది. మీరు ఈ వాలెంటైన్స్ డేకి మీ భాగస్వామికి లేదా మీకు మీరుగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటే, ఈ ఆఫర్లు ముగియకముందే మీకు నచ్చిన స్టోర్‌లో ఐఫోన్‌ను బుక్ చేసుకోండి మరి.

Also Read: ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షనా? రూ.2వేల లోపే బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవిగో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×