E-Paper
Advertisement

Smart Fans Mar 2026: మార్చిలో రాబోయే ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

Smart Fans Mar 2026: మార్చిలో రాబోయే ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!
Advertisement

Smart Fans Mar 2026:  ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతీది స్మార్ట్ గా మారిపోయింది. ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా ప్రతీ దానిలోనూ అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి. అదే సమయంలో స్మార్ట్ ఫ్యాన్లు సైతం మార్కెట్ లోకి వచ్చేశాయి. కూర్చున్న చోటు నుంచి కదలకుండానే ఈ ఫ్యాన్లను వినియోగించవచ్చు. అయితే 2026 వేసవిని దృష్టిలో ఉంచుకొని టాప్ బ్రాండ్ కంపెనీలు.. సరికొత్త స్మార్ట్ ఫ్యాన్లను తీసుకొస్తున్నాయి. మార్చి చివరినాటికి అందుబాటులో ఉండనున్న టాప్ – 5 అత్యాధునిక స్మార్ట్ ఫ్యాన్లను ఇప్పుడు పరిశీలిద్దాం.

Atomberg Aris Starlight

స్మార్ట్ ఫ్యాన్ల విభాగంలో అతంబర్గ్ కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంది. గత మోడళ్లతో పోలిస్తే 2026 ఎడిషన్ లో మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో ఇంటిగ్రేటెడ్ LED లైట్ ఉంది. ఇది రాత్రిళ్లు బెడ్ లైట్ లాగా పనిచేస్తుంది. ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే వై-ఫై (Wi-Fi), అలెక్సా (Alexa), గూగుల్ అసిస్టెంట్‌తో కంట్రోల్ చేయవచ్చు. యాప్ ద్వారా పవర్ వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉండటం వల్ల నెలకు కరెంటు బిల్లులో రూ.100 -150 వరకు ఆదా అవుతుంది.

Havells Stealth Slim BLDC+

Advertisement

హావెల్స్ కంపెనీకి చెందిన ఈ కొత్త మోడల్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్‌ లుక్ కలిగి ఉంటుంది. ‘Silent Operation’ ఫీచర్‌ ఉన్నందున ఫ్యాన్ తిరిగేటప్పుడు ఏమాత్రం శబ్దం రాదు. అలాగే ఇది  AI ఆధారిత ఉష్ణోగ్రత నియంత్రణను కలిగి ఉంటుంది. గదిలోని వేడిని బట్టి ఫ్యాన్ వేగాన్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దుమ్ము పట్టకుండా ఉండే ‘Anti-Dust’ కోటింగ్ ఈ ఫ్యాన్ కు ఉన్న మరో ప్రత్యేకమైన ఫీచర్ గా చెప్పవచ్చు.

Crompton Silent Pro Blossom Smart

క్రాంప్టన్ కంపెనీకి చెందిన 2026 ఎడిషన్ మోడల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని రెక్కలు (Blades) ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉండటం వల్ల గాలి వేగం మిగతా వాటితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ‘Natural Breeze’ ఫీచర్.. బయట నుంచి వచ్చే గాలికి అనుగుణంగా తన వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. పెద్ద గదులకు (Living Rooms) ఇది చాలా అనువుగా ఉండనుంది.

Orient Electric Aeroslim Smart

Advertisement

స్టైలిష్ లుక్, స్లిమ్ డిజైన్ స్మార్ట్ ఫ్యాన్ ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇది టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ ను యాప్ తో పాటు స్మార్ట్ రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. రిమోట్‌లో ఉండే ‘Sleep Mode’,’Timer’ఆప్షన్లు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు. విద్యుత్ కోత సమయాల్లో ఈ ఫ్యాన్ ను ఇన్వర్టర్ మీద వాడితో సాధారణ వాటి కంటే 3 రెట్లు ఎక్కువ సమయం ఇవి పనిచేస్తాయి.

Also Read: Best Dishwasher Brands: కొత్త డిష్ వాషర్ కావాలా? ట్రెండింగ్ మోడల్స్ ఇవే.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Superfan Super myQ

దేశంలోని తొలి ఆఫ్ లైన్ వాయిస్ కంట్రోల్ స్మార్ట్ ఫ్యాన్ గా ఇది గుర్తింపు పొందింది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. కేవలం మీ మాటలతోనే దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకు ‘ఫ్యాన్ స్పీడ్ 3’ అని అనగానే.. ఆ వేగం దానికి అనుగుణంగా మారిపోతుంది. ఇది 35 వాట్ల పవర్ ను మాత్రమే వినియోగిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీనికి అందించారు. ఇంటర్నెట్ లేదా వైఫై సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ ఫ్యాన్ అనువైనదిగా ఉంటుంది.

Also Read: Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన అవని.. నిజం బయటపడిందా..? మీనాక్షిని సేఫ్..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×