E-Paper
Advertisement

Upcoming Phones April 2026: వన్‌ప్లస్ నుంచి శాంసంగ్ వరకు.. ఏప్రిల్‌లో విడుదలయ్యే క్రేజీ ఫోన్ల లిస్ట్ ఇదే!

Upcoming Phones April 2026: వన్‌ప్లస్ నుంచి శాంసంగ్ వరకు.. ఏప్రిల్‌లో విడుదలయ్యే క్రేజీ ఫోన్ల లిస్ట్ ఇదే!
Advertisement

Upcoming Phones April 2026: ఏప్రిల్ నెల వచ్చేస్తోంది.. దీంతోపాటు మొబైల్ మార్కెట్లో కొత్తఫోన్ల సందడి కూడా మొదలవ్వబోతోంది. కొత్త టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లు, అది కూడా తక్కువ బడ్జెట్‌లో వచ్చే స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈనెల పండగలా ఉండబోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల నుంచి ప్రీమియం ఫోన్లను ఇష్టపడే వారి వరకు అందరికీ నచ్చేలా రకరకాల బ్రాండ్లు తమ కొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ ధరలో 5G మొబైల్స్..

వచ్చే నెలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన ఫోన్లలోAi+ Nova సిరీస్ ఒకటి. మాధవ్ షేత్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఏప్రిల్ 9వ తేదీన Nova 2, Nova 2 Ultra మోడళ్లను విడుదల చేయనుంది. కేవలం రూ.11,000 నుంచి రూ.15,000 లోపు ధరలో లభించే ఈ ఫోన్లు సామాన్యులకు కూడా 5G టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌లో వెనుక వైపు వచ్చే నోటిఫికేషన్ లైట్లు యువతను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి డిజైన్ కావాలనుకునే వారికి ఇది బెటర్ ఆప్షన్ కానుంది.

Advertisement

Also Read: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!

రంగంలోకి ప్రముఖ బ్రాండ్స్..

శాంసంగ్, పోకో కంపెనీలు కూడా తమ కొత్త అస్త్రాలను సిద్ధం చేశాయి. శాంసంగ్ నుంచి Galaxy A37 5G మోడల్ ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇది సుమారు రూ.25,000 ధరలో 6 ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు గేమింగ్ ఎక్కువగా ఇష్టపడే వారి కోసం Poco X8 Pro Max సిద్ధమవుతోంది. దీనిలో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీ ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఛార్జింగ్ సమస్య లేకుండా ఎక్కువ సేపు ఫోన్ వాడుకునే అవకాశం ఉంటుంది.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వన్‌ప్లస్..

Advertisement

వన్‌ప్లస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OnePlus Nord 6 కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన డిస్‌ప్లేతో రాబోతున్న ఈ ఫోన్ సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. స్పీడ్, కెమెరా విషయంలో రాజీ పడనివారికి వన్‌ప్లస్ ఇచ్చే ఫీచర్లు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సారి కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొత్త మోడల్ రాబోతోంది.

విభిన్నమైన ఫీచర్లు..

ఇవే కాకుండా.. Motorola Edge 70 Fusion, Infinix Note 60 Pro వంటి ఫోన్లు కూడా క్యూలో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ ఫోన్‌లో వెనుక వైపు మ్యాట్రిక్స్ డిస్‌ప్లే ఉంటుందనే వార్త టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే రియల్‌మీ నుంచి వస్తున్న తక్కువ ధర ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఏప్రిల్ వరకు కొంచెం ఓపిక పడితే.. తమకు నచ్చిన బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్‌ను ఎంచుకోవచ్చు.

Also Read: ఐఫోన్‌కు కూడా సాధ్యం కాని డిజైన్.. యువతను కట్టిపడేసేలా గూగుల్ స్పెషల్ సర్ప్రైజ్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×