E-Paper
Advertisement

Low Price Smartphones: ఓరి బాబోయ్ ఇలాంటి ఆఫర్లు ఎన్నడూ సూడలే.. 15,600mAh బ్యాటరీ, 200MP క్వాడ్-కెమెరా ఫోన్లపై 69శాతం డిస్కౌంట్స్..!

Low Price Smartphones: ఓరి బాబోయ్ ఇలాంటి ఆఫర్లు ఎన్నడూ సూడలే.. 15,600mAh బ్యాటరీ, 200MP క్వాడ్-కెమెరా ఫోన్లపై 69శాతం డిస్కౌంట్స్..!
Advertisement

Cheapest Smartphones: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ Ulefone అధిక సామర్థ్యం గల ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. దాని భారీ సామర్థ్యం కారణంగానే ఈ కంపెనీ బాగా ప్రసిద్ధి చెందింది. ఈ చైనీస్ బ్రాండ్ ఇటీవల Ulefone Armor 25T ప్రో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ ఫోన్‌లపై AliExpress ప్లాట్‌ఫారమ్‌లో భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలీఎక్స్‌ప్రెస్‌లో కొత్త సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. జూన్ 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో UIefone మొబైల్ ఫోన్‌లను 69 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని ప్లాట్‌ఫారమ్ పేర్కొంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ మోడల్స్‌పై కూడా డిస్కౌంట్లు ఇస్తున్నారు.

Ulefone అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. Ulefone కంపెనీ ఫోన్లపై AliExpress 69 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ మోడళ్లపై ఈ తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక డిస్కౌంట్ల విషయానికొస్తే.. ఇటీవలే రిలీజ్ అయిన Ulefone Armor 25T ప్రో ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర వెబ్‌సైట్‌లో $499 ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.41,630గా ఉంది. అయితే ఇప్పుడు $289 లతో అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.24,110 ధరతో కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌తో పాటు కంపెనీ అనేక ఉచిత బహుమతులు కూడా ఇస్తోంది.

Advertisement

Also Read: అస్సలు నమ్మలేరు.. రూ.6వేలకే కొత్త ఫోన్లు.. ఇదేలా సాధ్యం!

ఇది కాకుండా Ulefone Armor 26 Ultra Walkie-Talkie ఎడిషన్ కూడా సేల్ సమయంలో బడ్జెట్ ధరకు కొనుక్కోవచ్చు. ఈ మోడల్ అసలు ధర $699.99 (రూ.58,398) ఉండగా ఇప్పుడు $419.99 (రూ.35,038) ధరకే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ వాకీ-టాకీ సపోర్ట్ కారణంగా రిమోట్‌గా వ్యక్తులతో మాట్లాడేందుకు ఇది మంచి మోడల్. Ulefone 26 Ultra కూడా మంచి తగ్గింపును పొందుతోంది. 15,600mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ వంటి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ AliExpressలో సేల్ సమయంలో $359.99 (రూ.30,033)కి అందుబాటులో ఉంది. ఈ మోడల్ 121dB స్పీకర్‌తో అమర్చబడింది. ఇది 200MP క్వాడ్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్‌తో పాటు Ulefone Armor Pad 3 Pro టాబ్లెట్ కూడా ఈ సేల్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఇది 50% తగ్గింపుతో $279.99 (రూ.23,358)కి అందుబాటులో ఉంది.

Advertisement

 

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×