E-Paper
Advertisement

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంత ఫోన్ చూశారా? లుక్ అదిరింది కానీ, అంతలోనే ఊహించని వివాదం!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంత ఫోన్ చూశారా? లుక్ అదిరింది కానీ, అంతలోనే ఊహించని వివాదం!
Advertisement

Trump Mobile T1: ఎప్పుడెప్పుడా అని చాలా కాలంగా అందరూ ఎదురుచూస్తున్న ఆ ‘ట్రంప్ ఫోన్’ కస్టమర్ల చేతుల్లోకి ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. నిజానికి పోయిన గతేడాది (ఆగస్టు)లోనే ఇది మార్కెట్లోకి రావాల్సింది. కానీ, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటూ దాదాపు 5 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అసలు ఈ ఫోన్ వస్తుందా? రాదా? అని బుక్ చేసుకున్న వాళ్లంతా తెగ టెన్షన్ పడ్డారు.

ఫైనల్‌గా ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ.. ముందస్తుగా (ప్రీ-ఆర్డర్) బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ వారమే ఫోన్ల డెలివరీలు స్టార్ట్ చేశామని కంపెనీ సీఈఓ పాట్ ఓబ్రెయిన్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. మిగిలిన వాళ్లకు కూడా రాబోయే కొన్ని వారాల్లో ఫోన్లు అందుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడీ ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఏమిటి? అసలు ఈ ఫోన్ వెనకున్న కథేంటో తెలుసుకుందాం..

ఫీచర్ల సంగతేంటి?

Advertisement

ఈ Trump Mobile T1 చూడటానికి తళతళలాడే గోల్డ్ కలర్‌లో భలే స్టైలిష్‌గా ఉంది. పెద్ద స్క్రీన్ ఇష్టపడే వాళ్ల కోసం దీనిలో 6.78 ఇంచుల డిస్‌ప్లే ఇచ్చారు. స్పీడ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను వాడారు. ఇక ఫొటోల కోసం వెనుక వైపు మూడు కెమెరాలు, రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటం కోసం పెద్ద 5,000 mAh బ్యాటరీని పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తుంది. అమెరికాలో ఏ సిమ్ వేసినా నడిచేలా దీనికి అన్ని లీగల్ పర్మిషన్లు కూడా వచ్చేశాయి.

ధర వివరాలు ఇలా..

ఇక రేటు విషయానికి వస్తే.. నార్మల్ యూజర్లకు అందుబాటులో ఉండేలా దీని స్టార్టింగ్ ప్రైస్‌ను 499 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.41వేల పైనే)గా ఫిక్స్ చేశారు. ఈ ఫోన్ కావాలనుకునే వాళ్లు మొదట 100 డాలర్లు అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు కంపెనీ ‘47 ప్లాన్’ అనే ఒక క్రేజీ ఆఫర్‌ను కూడా తెచ్చింది. నెలకు సుమారు 47.45 డాలర్లు కడితే చాలు.. అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజ్‌లు, ఫుల్ డేటాతో పాటు ఫోన్ పాడైపోతే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజులు నాన్‌స్టాఫ్ మ్యూజిక్.. Moto Buds 2 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

‘మేడ్ ఇన్ అమెరికా’ వెనకున్న కథేంటి?

అయితే ఈ ఫోన్ చుట్టూ ఒక పెద్ద వివాదమే నడిచింది. మొదట్లో ఈ ఫోన్‌ను 100% అమెరికాలోనే తయారు చేస్తున్నామంటూ కంపెనీ తెగ ప్రచారం చేసుకుంది. కానీ, అంత తక్కువ ధరకి అమెరికాలో ఫోన్ తయారు చేయడం సాధ్యం కాదని, అక్కడ దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా లేవని టెక్ నిపుణులు నిలదీశారు. దాంతో కంపెనీ సైలెంట్‌గా మాట మార్చేసింది. ఫోన్ విడిభాగాలు వేరే దేశాల నుంచి తెచ్చి, ఇక్కడ కేవలం అసెంబ్లింగ్ (భాగాలను అమర్చడం) మాత్రమే చేస్తున్నామని ఒప్పుకుంది. రాబోయే రోజుల్లో అమెరికా పార్ట్స్ వాడతామని కవర్ చేసుకుంది.

బుక్ చేసుకున్న వాళ్ల అసహనం..

డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే ఈ ఫోన్‌ బిజినెస్ చేయడంపై రాజకీయంగా చాలా రచ్చ జరిగింది. కానీ, ఆయన పిల్లలే ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకున్న రూల్స్ మధ్యలో మార్చడం, ఫోన్ గ్యారెంటీగా వస్తుందో రాదో అన్నట్లు కండిషన్స్ పెట్టడంతో కస్టమర్లు బాగా ఫీలయ్యారు. నెలల తరబడి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో విసిగిపోయిన జనాలకు గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ వారం నుంచే ఫోన్ డెలివరీలు మొదలుపెట్టామని, అందరికీ త్వరలోనే ఫోన్లు అందుతాయని కంపెనీ సీఈఓ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Samsung Galaxy Z Flip 8 లీక్స్.. డిజైన్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది మామా.. ఆ క్రేజీ ఫీచర్ కూడా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×