E-Paper
Advertisement

SIM Validity: రీఛార్జ్ చేయకుండా.. సిమ్‌ను ఎన్ని రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చో తెలుసా?

SIM Validity: రీఛార్జ్ చేయకుండా.. సిమ్‌ను ఎన్ని రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చో తెలుసా?
Advertisement

SIM Validity: ఒకప్పుడు మెుబైల్ నెంబర్ ఒక్క కాల్స్ కు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో ఫోన్ నెంబర్ ఎన్నో పనులతో ముడిపడి పోయింది. బ్యాంకింగ్ అవసరాలు, ఆధార్ వెరిఫికేషన్, ఓటీపీలు ఇలా ప్రతీ ఒక్కటీ మెుబైల్ నెంబర్ పై ఆధారపడుతున్నాయి. ఒకవేళ మెుబైల్ నెంబర్ డీయాక్టివేట్ అయితే ఇవన్నీ ఆగిపోయే ప్రమాదముంది. దీనిని గమనించిన టెలికాం సంస్థలు తప్పనిసరిగా ఏదోక ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలని యూజర్లపై ఒత్తిడి చేస్తున్నాయి. లేదంటే సిమ్ డీయాక్టివేట్ చేస్తామంటూ పరోక్షంగా బెదిరిస్తున్నాయి. అసలు ట్రాయ్ నిబంధనల ప్రకారం రీఛార్జ్ చేసుకోకుండా సిమ్ ను ఎన్నిరోజులు యాక్టివ్ గా ఉంచవచ్చో ఈ కథనంలో పరిశీలిద్దాం.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం సిమ్ కార్డ్ యాక్టివ్ గా ఉండాలంటే రీఛార్జ్ తప్పనిసరి. ఒక వ్యక్తి సిమ్ కార్డును ఎక్కువ రోజుల పాటు రీఛార్జ్ చేయకుండా ఉండే దానిని డీయాక్టివేట్ చేసే అధికారం టెలికాం రంగ సంస్థలకు ఉంది. అయితే ట్రాయ్ రూల్స్ ప్రకారం ఒక ప్రీపెయిడ్ సిమ్ కార్డు 90 రోజుల పాటు యాక్టివ్ గా లేకపోతే.. టెలికాం రంగ సంస్థలు చర్యలకు ఉపక్రమించవచ్చు.

రూ.20 కట్.. 30 రోజులు పొడగింపు

Advertisement

ఒకవేళ సిమ్ లో బ్యాలెన్స్ ఉంటే రూ.20 కట్ చేసుకొని వ్యాలిడిటీని మరో 30 రోజులకు టెలికాం సంస్థలు పొడిగిస్తాయి. అలా కాకుండా రూ.20 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే తాత్కాలికంగా డీయాక్టివేట్ చేస్తారు. అనంతరం 15 రోజుల గ్రేస్ పీరియడ్ లో యాక్టివేట్ చేసుకోకపోతే.. మెుబైల్ నెంబర్ ను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశముందని టెలికాం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దశలవారీగా సేవలు నిలిపివేత

అయితే ఈ డీయాక్టివేట్ ప్రక్రియను దశలవారీగా టెలికాం రంగ సంస్థలు అమలు చేస్తాయి. రీఛార్జ్ ప్లాన్ గడువు ముగియగానే ముందుగా అవుట్ గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లను నిలిపివేస్తాయి. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం 90 రోజుల వరకూ ఇన్ కమింగ్ కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఓటీపీలు యథావిధిగా వస్తుంటాయి. నిర్దేశిత గడువు పూర్తయిన తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ తో పాటు, ఓటీపీ రావడాన్ని టెలికాం సంస్థలు నిలిపివేస్తాయి. ఒకసారి సిమ్ పూర్తిగా డీయాక్టివేట్ అయితే.. ఆ నెంబర్ ను కొంత కాలం తర్వాత వేరే కొత్త కస్టమర్ కు టెలికాం సంస్థలు కేటాయిస్తాయి.

Advertisement

Also Read: ఐఫోన్ ఊరికే హీట్ ఎక్కుతోందా? వీటి వల్లే కావొచ్చు.. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

టెలికాలం ఆపరేటర్ల టైమ్ లిమిట్

ప్రస్తుతం దేశంలో జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సంస్థలు.. టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వీఐ.. సిమ్ యాక్టివ్ గా లేని కాలాన్ని 90 రోజులుగా నిర్ణయించాయి. ఈలోపు రీఛార్జ్ చేసుకోపోతే నిర్దాక్షణ్యంగా సిమ్ ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం.. 165 రోజుల పాటు ఏ ప్లాన్ లేకున్నా ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు.

Also Read: ఏసీ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కుతోందా? అయితే మూడినట్లే.. వెంటనే ఇలా చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×