E-Paper
Advertisement

Telecom: మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త.. కొత్త నిబంధనలు అప్లై, అసలు మేటరేంటి?

Telecom: మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త.. కొత్త నిబంధనలు అప్లై, అసలు మేటరేంటి?
Advertisement

Telecom: టెలికాం ఆపరేటర్ల మొబైల్‌ ప్రీపెయిడ్‌ చందాదారుల గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని ఎంపీలు నిలదీయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగింది?

మొబైల్ రీఛార్జి వినియోగదారులకు శుభవార్త

Advertisement

గడిచిన రెండురోజులుగా టెలికాం గురించి విపక్ష సభ్యులు రాజ్యసభలో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ఎంపీలు ప్రస్తావించారు. టెలికాం ఆపరేటర్ల ధరల విధానంలో చాలాకాలంగా ఉన్న ఓ లోపం వెలుగులోకి వచ్చింది. ఇది ముమ్మాటికీ ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకునేలా ప్రొత్సహించింది. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు పలువురు ఎంపీలు.

కావాలనే టెలికాం ఆపరేటర్లకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  దీనిపై కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. మొబైల్ రీఛార్జ్ వినియోగదారులు నెల వారీ రీఛార్జి చేసుకుంటే కేవలం 28 రోజుల కాల పరిమితి ఇచ్చేవి టెలికాం ఆపరేటర్లు. దీన్ని నెల రోజులుగా మార్చాలని టెలికాం సంస్థలకు ఆయన సూచించారు.

Advertisement

కొత్త నిబంధనలు అప్లై, టెలికాం మంత్రి క్లారిటీ

ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్‌, ఈ విషయమై టెలికాం సంస్థలకు స్పష్టత ఇచ్చింది. 30 రోజుల కాలపరిమితి గల ప్రీపెయిడ్‌ పథకాలు అమలు చేయాలని తాము కోరలేదని తెలిపింది. తప్పనిసరిగా 30 రోజుల కాలపరిమితి గల ప్లాన్ ఉండాలని సూచించింది. ప్రతి విభాగంలో 30 రోజుల కాలపరిమితి గల రీఛార్జ్ ప్లాన్ ఉండాలని తేల్చి చెప్పింది.

దీనికి సంబంధించిన సూచనలు 2022లో ట్రాయ్‌ నిర్దేశించినట్లు గుర్తు చేశారు. ప్లాన్‌ ఓచర్లు, స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్లు, కాంబో ఓచర్లు ఇలా రీఛార్జ్ ప్లాన్ చూసినా అందులో కచ్చితంగా 30 రోజులు ఉండాల్సిందేనని సూచించింది. ఏ టెలికాం ఆపరేటర్ ప్రవేశపెట్టే ప్లాన్‌లో తప్పనిసరిగా వన్-టైమ్ ప్లాన్, ఒక కస్టమ్ ప్లాన్, 30-రోజుల ప్లాన్ వంటివి ఈ మూడు కేటగిరీల ప్లాన్‌లు ఉండాలని టాయ్ తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ మొబైల్ వినియోగదారుడు రీఛార్జ్ చేయకపోయినా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అనుమతించాలన్నారు. వినియోగదారుడు రీఛార్జ్ ప్లాన్‌కు మొత్తం చెల్లించినప్పటికీ టెలికాం కంపెనీలు 24 గంటల రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తున్నాయని తెలిపారు.

ALSO READ:  మెదడుతో ల్యాప్‌టాప్ కంట్రోల్ చేసిన యువకుడు.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే

అర్ధరాత్రికి ఉపయోగించని డేటా గడువు ముగుస్తుందని వాదించారు. రోజువారీ డేటా రీఛార్జ్ ప్లాన్‌లో మిగిలిన డేటాను తదుపరి రోజు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. రీఛార్జి చేయకపోతే అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ను ఆపడం సబబే? ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపుతున్నారని సదరు ఎంపీ ప్రశ్నించారు. ఏడాది వరకు ఇన్‌కమింగ్‌కాల్స్‌, మెసేజ్‌లు అందుకునే అవకాశం మొబైల్‌ వినియోగదారులకు కల్పించాలని సూచించారు.

ట్రాయ్‌ ఆదేశాల ప్రకారం 90 రోజుల పాటు రీఛార్జి చేయకపోతే ఆ కనెక్షన్‌ను డీయాక్టివేట్‌ చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన నేపథ్యంలో రీఛార్జ్ ప్లాన్‌ల చెల్లుబాటు కాలం, ఇన్‌కమింగ్ కాల్స్ అనే రెండు విషయాలను ట్రాయ్ పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×