E-Paper
Advertisement

కేస్‌పైనే LCD డిస్‌ప్లేనా? Tozo Open X2 Pro ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

కేస్‌పైనే LCD డిస్‌ప్లేనా? Tozo Open X2 Pro ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Tozo Open X2 Pro: హెడ్‌ఫోన్స్ వాడేటప్పుడు చెవులు నొప్పి పుడుతున్నాయా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ Tozo తన సరికొత్త ‘Tozo Open X2 Pro’ ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు. వీటి ఫీచర్లు వింటే మీరు షాక్ అవుతారు. ముఖ్యంగా దీని ఛార్జింగ్ కేస్‌పై ఉండే LCD స్క్రీన్ మీ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ ని మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. అసలు ఇందులో ఏముందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Tozo Open X2 Pro- కొత్త తరం ఆడియో మ్యాజిక్:

సాధారణంగా మనం వాడే ఇయర్ బడ్స్ చెవికి కొంచెం లోపలి వరకు వెళ్తాయి. దీనివల్ల ఎక్కువ సేపు పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ Tozo Open X2 Pro అలా కాదు. ఇది ఓపెన్-ఇయర్ డిజైన్‌తో వస్తుంది. అంటే ఇది మీ చెవి లోపల ఉండదు. చెవి పైన సెట్ అవుతుంది.

Advertisement

పవర్‌ఫుల్ సౌండ్ క్వాలిటీ:
మ్యూజిక్ అంటే ఇష్టపడే వారికి బేస్ చాలా ముఖ్యం. ఇందులో 15.4mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి మీకు క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. మీరు పాటలు వింటున్నా లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా.. అవతలి వారి మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. దీని ద్వారా సినిమా థియేటర్ లాంటి ఫీల్ మీరు పొందవచ్చు.

LCD డిస్‌ప్లేతో కూడిన ఛార్జింగ్ కేస్:
ఈ ఇయర్‌బడ్స్‌లో హైలైట్ ఏంటంటే దాని కేస్. దీని ఛార్జింగ్ కేస్‌పై ఒక స్మార్ట్ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇయర్‌బడ్స్‌లో ఎంత ఛార్జింగ్ ఉంది. కేస్‌లో ఎంత ఉంది అనేది మీరు నేరుగా చూసుకోవచ్చు. అంతేకాకుండా.. కేస్ ద్వారానే వాల్యూమ్ పెంచడం, పాటలు మార్చడం వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది గ్యాడ్జెట్ కి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

Advertisement

బ్యాటరీ బ్యాకప్ ఇక రోజంతా వినొచ్చు:
మ్యూజిక్ లవర్స్ ప్రధానంగా చూసేది బ్యాటరీ. Tozo Open X2 Pro ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 36 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. అంటే మీరు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు రెండు రోజుల పాటు బ్యాటరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాంగ్ ట్రావెల్ చేసే వారికి.. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

కంఫర్ట్, డిజైన్:
దీన్ని వాడేటప్పుడు అస్సలు బరువుగా అనిపించదు. దీనికి ఎర్గోనామిక్ ఇయర్ హుక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు రన్నింగ్ చేస్తున్నా.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నా ఇవి కింద పడిపోవు. చెవికి గాలి తగిలేలా డిజైన్ చేయడం వల్ల ఎక్కువ సేపు పెట్టుకున్నా చెమట పట్టదు లేదా అసౌకర్యంగా ఉండదు.

Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ నెక్‌బ్యాండ్ కావాలా? అమెజాన్‌లో ఈ మోడల్స్ అస్సలు మిస్ అవ్వకండి

కనెక్టివిటీ , ఇతర ఫీచర్లు:
ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది ఫోన్‌కి వెంటనే కనెక్ట్ అవుతుంది.

IPX5 రేటింగ్ ఉండటం వల్ల వర్షం చినుకులు లేదా చెమట తగిలినా ఇవి పాడైపోవు.

ఫోన్ కాల్స్ కోసం నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఉంది. కాబట్టి దీని వల్ల బయట ట్రాఫిక్ సౌండ్స్ వినిపించకుండా క్లియర్ గా మాట్లాడవచ్చు.

మీరు లేటెస్ట్ ఆడియో ఫీల్ కావాలనుకుంటే.. స్టైల్‌తో పాటు కంఫర్ట్ కూడా ముఖ్యం అనుకుంటే Tozo Open X2 Pro మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ టెక్ ప్రపంచంలో ఇలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటాయి. మీరు గనక కొత్త ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఒకసారి వీటిపై లుక్కేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×