E-Paper
Advertisement

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే.. 50 ఇంచుల టీవీ రూ. 27వేలకే !

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే.. 50 ఇంచుల టీవీ రూ. 27వేలకే !
Advertisement

Toshiba C350NP 50 inch 4K TV: ఇంటిని ఒక చిన్న హోమ్ థియేటర్‌లా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే మార్కెట్లో.. ఇప్పుడు 50 ఇంచుల బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రేజీ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ తోషిబా సరికొత్తగా “Toshiba C350NP (50 inch) Ultra HD (4K) Smart Google TV” ని మార్కెట్లోకి తెచ్చింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సౌండ్ ,తోషిబా సిగ్నేచర్ ఇంజన్‌తో వస్తున్న ఈ టీవీ పూర్తి ఫీచర్లు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్టల్ క్లియర్ 4K డిస్‌ప్లే:
తోషిబా C350NP స్మార్ట్ టీవీ 126 సెం.మీ (50 ఇంచులు) భారీ అల్ట్రా హెచ్‌డీ (4K)డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిజల్యూషన్ వల్ల ప్రతి విజువల్ అత్యంత స్పష్టంగా, సహజ రంగులతో కనిపిస్తుంది. ఈ టీవీలోని ప్రధాన హైలైట్ ‘REGZA Engine ZR’ టెక్నాలజీ. ఇది డిస్‌ప్లే క్వాలిటీని రియల్-టైమ్‌లో ఆప్టిమైజ్ చేసి, సాధారణ విజువల్స్‌ను కూడా హై-క్వాలిటీ రేంజ్‌లో చూపిస్తుంది. సినిమా లవర్స్‌కు ఈ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఒక విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

Advertisement

డాల్బీ విజన్:
ఈ స్మార్ట్ టీవీలో ప్రీమియం రేంజ్ డాల్బీ విజన్, HDR10 సపోర్ట్ అందించారు. దీని వల్ల చీకటి సీన్లలో కూడా విజువల్స్ చాలా క్లియర్ గా, ఎక్కువ డీటెయిలింగ్‌తో కనిపిస్తాయి. బ్రైట్‌నెస్ , కాంట్రాస్ట్ రేషియో చాలా పర్ఫెక్ట్‌గా మేనేజ్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో 4K కంటెంట్ చూసేటప్పుడు ఈ ఫీచర్ అద్భుతంగా హెల్ప్ అవుతుంది. బెజెల్-లెస్ (అంచులు లేని) డిజైన్ టీవీకి మరింత మోడ్రన్ లుక్ ఇస్తుంది.

థియేటర్ రేంజ్ :
మంచి విజువల్స్‌తో.. పాటు పవర్‌ఫుల్ సౌండ్ ఉంటేనే కదా అసలైన మజా వస్తుంది! అందుకే తోషిబా ఈ మోడల్‌లో పవర్‌ఫుల్ స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీని ఇన్-బిల్ట్ గా ఇచ్చింది. ఇది గది నలుమూలల నుంచి త్రీ-డైమెన్షనల్ సౌండ్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్స్ లేదా హోమ్ థియేటర్ సిస్టమ్స్ అవసరం లేకుండానే బెస్ట్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

Advertisement

స్మార్ట్ గూగుల్ టీవీ ఓఎస్:
ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా.. మీ ఇష్టాలకు అనుగుణంగా ఓటీటీ యాప్స్ (యూట్యూబ్, హాట్‌స్టార్, జియోసినిమా) నుంచి కంటెంట్‌ను హోమ్ స్క్రీన్‌పైనే రికమండ్ చేస్తుంది. ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గేమింగ్ , ఇతర డివైజెస్ కనెక్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ హెచ్‌డీఎమ్‌ఐ , యూఎస్‌బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై సపోర్ట్ ఉన్నాయి.

ధర ?
ఇన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ టీవీ ప్రస్తుత మార్కెట్ ధర కేవలం రూ.26,699 గా ఉంది. రూ. 30 వేల లోపు బడ్జెట్‌లో 50 ఇంచుల బిగ్ స్క్రీన్, పవర్‌ఫుల్ సౌండ్, అడ్వాన్స్‌డ్ గూగుల్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×