E-Paper
Advertisement

రూ.3వేలలోపు అమ్మాయిల కోసం.. బెస్ట్ స్మార్ట్‌వాచెస్ ఇవే!

రూ.3వేలలోపు అమ్మాయిల కోసం.. బెస్ట్ స్మార్ట్‌వాచెస్ ఇవే!
Advertisement

Best smartwatches for women under 3000: నేటి తరం అమ్మాయిలు స్టైల్‌తో పాటు హెల్త్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే చేతికి ఒక మంచి స్మార్ట్‌వాచ్ ఉంటే.. లుక్ అదిరిపోవడమే కాదు, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కూడా ఈజీ అవుతుంది. అయితే రూ.3వేల బడ్జెట్‌లోనే బ్లూటూత్ కాలింగ్, సూపర్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ మానిటర్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఇచ్చే బెస్ట్ స్మార్ట్‌వాచెస్ మార్కెట్లో చాలా ఉన్నాయి. మీ డ్రెస్‌లకు మ్యాచింగ్ అయ్యేలా, రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా సరిపోయే టాప్ 5 లేటెస్ట్ స్మార్ట్‌వాచెస్ లిస్ట్..

5 లేటెస్ట్ స్మార్ట్‌వాచెస్: 

1. Fire-Boltt Phoenix Bluetooth Calling Smartwatch:

ఈ వాచ్ అమ్మాయిల చేతికి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇందులో రౌండ్ డయల్ , స్లీక్ డిజైన్ ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా ఫోన్ తీయకుండానే మాట్లాడవచ్చు. పీరియడ్ ట్రాకర్, 120+ స్పోర్ట్స్ మోడ్స్ దీని ప్రత్యేకత.
ధర: సుమారు రూ.1,499 – రూ.1,799

2. Noise ColorFit Pulse 4:

Advertisement

అమోలెడ్ డిస్‌ప్లే కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో 1.85 ఇంచుల పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఎప్పుడూ ఆన్‌లో ఉండే ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’ ఫీచర్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది. హార్ట్ రేట్, SpO2 , స్ట్రెస్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ధర: సుమారు రూ.1,999 – రూ.2,499

3. boat Wave Call 2:

Advertisement

బోట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ వాచ్ డైలీ యూజ్‌కి చాలా రఫ్ అండ్ టఫ్. కాలింగ్ క్వాలిటీ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఇందులో వందలాది క్లౌడ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. కాబట్టి మీ మూడ్‌ని బట్టి రోజుకో స్క్రీన్ మార్చుకోవచ్చు. ఫిట్‌నెస్ క్రేజ్ ఉన్న అమ్మాయిలకు ఇది పర్ఫెక్ట్.
ధర: సుమారు రూ.1,299 – రూ.1,699

Also Read: లేటెస్ట్ ఫీచర్లతో.. రూ.25వేలలోపు టాప్ 5 వాషింగ్ మెషీన్స్

4. Fastrack Reflex Beat+:

యూత్ ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ ఫాస్ట్రాక్. స్పోర్టీ అండ్ స్టైలిష్ లుక్ ఇచ్చే ఈ స్మార్ట్‌వాచ్‌లో సిలికాన్ స్ట్రాప్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. డీప్ స్లీప్ మానిటరింగ్, కెమెరా కంట్రోల్ , మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ధర: సుమారు రూ.1,499 – రూ.1,999

5. Boult Audio Drift 2:

రూ.2,000 లోపే ఒక అద్భుతమైన బ్లూటూత్ కాలింగ్ వాచ్ ఇది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 7 రోజుల వరకు వస్తుంది. ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ ఉండటం వల్ల జిమ్‌లో వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా చిన్నపాటి వర్షంలో కూడా ఇది అస్సలు పాడవ్వదు.
ధర: సుమారు రూ.1,399 – రూ.1,599

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×