E-Paper
Advertisement

వైర్‌లెస్ ఛార్జింగ్ నుంచి ప్రో లెవెల్ కెమెరా వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్సే ఇప్పుడు ట్రెండింగ్‌లో టాప్!

వైర్‌లెస్ ఛార్జింగ్ నుంచి ప్రో లెవెల్ కెమెరా వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్సే ఇప్పుడు ట్రెండింగ్‌లో టాప్!
Advertisement

Best Wireless Charging Phones: సాధారణంగా మనం ఫోన్ కొనేటప్పుడు ప్రీమియం ఫీచర్లు కోరుకోవడం సహజం. ముఖ్యంగా వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఆ ఫోన్ వాడకమే ఒక లగ్జరీగా అనిపిస్తుంది. ఈ క్రమంలో మీరు రూ.80,000 లోపు బడ్జెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు అద్భుతమైన కెమెరా, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్ ఫోన్ల కోసం చూస్తుంటే.. ఈ కింద పేర్కొన్న మోడల్స్‌పై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S25

శాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ ఫోన్ లుక్స్ పరంగా చాలా క్లాస్‌గా ఉంటుంది. దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. దీని కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉండటమే కాకుండా.. రాబోయే ఐదేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు వస్తుంటాయి. లాంగ్ టర్మ్ వాడకానికి ఇది సరైన ఎంపిక.

Advertisement

Also Read: రూ.500 లోపు బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. వైర్‌లెస్ కంటే క్లియర్ సౌండ్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్!

Apple iPhone 16

ఐఫోన్ వాడాలని చాలా మందికి ఒక కల ఉంటుంది. ఐఫోన్ 16 మీ బడ్జెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ప్రీమియం డిజైన్, స్పీడ్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే కెమెరా క్లారిటీ యూజర్లను బాగా ఆకట్టుకుంటాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా చాలా కాలం పాటు రెగ్యులర్‌గా వస్తాయి.

Google Pixel 10

Advertisement

మీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టమైతే.. కళ్లు మూసుకుని గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలు చేయొచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో కెమెరా రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి అదనపు యాప్స్ లేని క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్, స్మార్ట్ ఏఐ ఫీచర్లు ఫోన్ వాడకాన్ని మరింత సులభతరం చేస్తాయి.

OnePlus 14, Xiaomi 16

ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు అద్భుతమైన డిస్‌ప్లే కావాలనుకునే వారికి వన్‌ప్లస్ 14 చాలా బాగా సెట్ అవుతుంది. దీని బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇక ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే ఆశించే వారికి షియోమి 16 కూడా ఒక మంచి ఆప్షన్. ఇందులో కెమెరాలు, డిస్‌ప్లే క్వాలిటీ అన్నీ ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటాయి.

Also Read: ఇక వాట్సప్ లాగిన్‌కు OTP అవసరం లేదు.. హ్యాకర్లకు షాక్ ఇచ్చిన Vi కొత్త టెక్నాలజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×