E-Paper
Advertisement

డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!
Advertisement

AI Security Cameras: ఇప్పుడు సాధారణ సెక్యూరిటీ కెమెరాల కాలం మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో వచ్చే స్మార్ట్ కెమెరాలు హోమ్ సెక్యూరిటీని పూర్తిగా మార్చేస్తున్నాయి. పాత కెమెరాల్లో చిన్నగా నీడ పడినా, చెట్ల ఆకులు కదిలినా అనవసరమైన అలర్ట్‌లు వచ్చేవి. కానీ, ప్రస్తుత AI కెమెరాలు మనుషులు, వాహనాలు, పెంపుడు జంతువులను స్పష్టంగా గుర్తించగలవు. దీనివల్ల తప్పుడు అలర్ట్‌లు తగ్గి, నిజమైన ప్రమాదాలను మనం వెంటనే గుర్తించవచ్చు.

బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరాలు..

తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌డోర్ కెమెరా కోసం చూస్తుంటే.. TP-Link Tapo C310 మంచి ఆప్షన్. ఇది ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని పనిచేస్తుంది. క్లౌడ్ స్టోరేజ్ కోసం అదనపు ఖర్చు లేకుండా లోకల్ మెమరీ కార్డ్‌తోనే పని కానిచ్చేయవచ్చు. అలాగే గృహాల కోసం Hikvision Ezviz WiFi Dual Lens కెమెరా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని డబుల్ లెన్స్ డిజైన్ వల్ల ఎక్కువ ఏరియాను కవర్ చేయడమే కాకుండా.. మనుషులను మాత్రమే టార్గెట్ చేసి ఖచ్చితమైన అలర్ట్స్ పంపుతుంది.

Advertisement

Also Read: ఐఫోన్ Vs ఆండ్రాయిడ్.. ప్రైవసీ విషయంలో ఏది సేఫ్? కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

ప్రైవసీకి పెద్దపీట..

సెక్యూరిటీ కెమెరా రికార్డింగులు బయటకు లీక్ అవుతాయేమో అనే భయం చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం EufyCam S3 Pro
సరైన ఎంపిక. ఇది ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలోని డేటా ప్రాసెసింగ్ అంతా ఆన్‌లైన్ క్లౌడ్‌లో కాకుండా కెమెరా డివైజ్‌లోనే జరుగుతుంది. అందువల్ల రికార్డింగులు సురక్షితంగా మన నియంత్రణలోనే ఉంటాయి.

పెద్ద పెద్ద ప్రాపర్టీల కోసమైతే..

Advertisement

ఇక పెద్ద పెద్ద ఇళ్లు, ఆఫీసులు లేదా వ్యాపార సంస్థల భద్రత కోసం IQ 4K UHD Gemini AI, Ubiquiti Unify AI Professional వంటి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫేషియల్ రికగ్నిషన్, వెహికల్ ఐడెంటిఫికేషన్ వంటి అత్యంత ఆధునిక ఫీచర్లతో వస్తాయి. 4K క్వాలిటీతో ఉండే ఈ కెమెరాలు పెద్ద ఏరియాలను పర్యవేక్షించడానికి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

Also Read: రోబోట్ క్లీనర్ నుండి స్మార్ట్ ప్లగ్ వరకు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన బెస్ట్ అలెక్సా డివైజెస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×