E-Paper
Advertisement

సామాన్యుల బ్రాండ్.. వర్ల్‌పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!

సామాన్యుల బ్రాండ్.. వర్ల్‌పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!
Advertisement

Whirlpool Refrigerators: మధ్యతరగతి ప్రజల్లో వర్ల్ పూల్ రిఫ్రిజిరేటర్లకు మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో అధునాతన ఫ్రిడ్జ్ లను అందిస్తుందని వర్ల్ పూల్ కు మార్కెట్ లో పేరుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో సామాన్యులు సైతం తక్కువ బడ్జెట్ లో లభించే అత్యుత్తమ ఫ్రిడ్జ్ కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వర్ల్ పూల్ బ్రాండ్ కు చెందిన టాప్ – 5 సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లు, వాటి ప్రధాన ఫీచర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. మీ అభిరుచి, అంచనాలకు దగ్గరగా ఉన్న దానిని ట్రై చేయండి.

Whirlpool 192 L 4 Star

ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఈ ఫ్రిడ్జ్ సరిగ్గా సరిపోతుంది. ఇది ఇన్సూలేటెడ్ క్యాపిలరీ టెక్నాలజీ (Insulated Capillary Technology)తో వర్క్ చేస్తుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ లో చల్లదనం ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. దీనిలోని 4 స్టార్ రేటింగ్ విద్యుత్ ఆదా చేస్తుంది. కరెంట్ పోయినప్పుడు కూడా దాదాపు 12 గంటల వరకు కూలింగ్ అట్టిపెట్టుకునే సామర్థ్యం ఈ ఫ్రిడ్జ్ కు ఉంది.

Whirlpool 236 L 5 Star

Advertisement

సింగిల్ డోర్ విభాగంలో ప్రీమియం ఫ్రిడ్జ్ ను కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. ఇందులో ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీ (Frost Free) ఉండటం వల్ల లోపల ఐస్ గడ్డకట్టే సమస్య ఉండదు. ఇది తక్కువ శబ్దంతో పనిచేయడంతో పాటు 5 స్టార్ రేటింగ్ తో వచ్చినందున విద్యుత్ ను సైతం ఆదా చేస్తుంది. 236 లీటర్ల అధిక స్టోరేజ్ సామర్థ్యం ఉండటం వల్ల.. పెద్ద కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.

Whirlpool 184 L 5 Star Direct Cool

చిన్న కుటుంబాలు, వంటగదిలో తక్కువ స్థలం ఉన్న వారికి ఈ ఫ్రిడ్జ్ బాగుంటుంది. ఇది Direct Cool టెక్నాలజీతో పనిచేస్తుంది. వేగంగా ఐస్ తయారీకి సాయపడుతుంది. 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల నెలకు కరెంట్ బిల్లు కూడా చాలా వరకూ పరిమితంగానే వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులోని ఆటో-కనెక్ట్ ఇన్వర్టర్ ఫీచర్ కారణంగా.. పవర్ కట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటి ఇన్వర్టర్‌కు కనెక్ట్ అవుతుంది.

Whirlpool 192 L 3 Star Vitamagic PRO

Advertisement

ఈ ఫ్రిడ్జ్ లోని విటమ్యాజిక్ టెక్నాలజీ (Vitamagic Technology) పండ్లు, కూరగాయలలోని విటమిన్లను ఎక్కువ కాలం తాజాగా ఉండేలా దోహదపడుతుంది. సాధారణంగా డైరెక్ట్-కూల్ ఫ్రిడ్జ్ లలో ఐస్ పేరుకుపోవడం సమస్యగా ఉంటుంది, కానీ ఇందులో ఆటో డీఫ్రోస్ట్ (Auto Defrost) బటన్ ఉండటం వల్ల దానిని ఉపయోగించి ఐస్ ను వేగంగా కరిగించేయవచ్చు.

Also Read: మంగ్లీ కేసులో భారీ ట్విస్ట్.. నిందితుడు మధు అరెస్ట్?

Whirlpool Icemagic Pro 207 L

ఈ ఫ్రిడ్జ్.. అత్యంత వేగంగా ఐస్ ను తయారు చేస్తుంది. దీనిలోని అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్ (Advanced Microprocessor), పవర్ ఫుల్ కూలింగ్ వ్యవస్థ వల్ల కొద్ది నిమిషాల్లోనే ఐస్ తయారవుతుంది. ఇందులోని లామినర్ ఎయిర్ ఫ్లో (Laminar Airflow) టెక్నాలజీ ఫ్రిడ్జ్ మొత్తం సమానంగా చల్లబడేలా చేస్తుంది. ఇది చూడటానికి స్టైలిష్ లుక్ ను కలిగి ఉండి.. లోపల ఎక్కువ ఆహారపదార్థాలను పెట్టుకునేందుకు అధిక స్పేస్ ను కలిగు ఉంది.

Also Read: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ థియేటర్ ప్రేక్షకులను మెప్పించిందా.. ఫుల్ రివ్యూ..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×