// // Best Touch Control Air Fryers 2026: డిజిటల్ టచ్ ఎయిర్ ఫ్రైయర్స్ -->
E-Paper
Advertisement

డిజిటల్ టచ్ ప్యానెల్‌తో వచ్చే.. బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

డిజిటల్ టచ్ ప్యానెల్‌తో వచ్చే.. బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!
Advertisement

Best Touch Control Air Fryers 2026: ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్‌నెస్ చాలా పెరిగిపోయింది.నూనె వస్తువులకు దూరంగా ఉంటూనే, టేస్టీ స్నాక్స్ తినాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. అందుకే ఇప్పుడు ప్రతీ ఇంట్లో ‘ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer)’ మస్ట్ హ్యావ్ కిచెన్ గ్యాడ్జెట్‌గా మారిపోయింది. పాతకాలపు నాబ్స్ తిప్పే అవసరం లేకుండా.. సింగిల్ టచ్‌తో నడిచే డిజిటల్ టచ్ కంట్రోల్ ఎయిర్ ఫ్రైయర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వాడుకోవడానికి ఎంతో ఈజీగా ఉండే టాప్ 5 టచ్ కంట్రోల్ ఎయిర్ ఫ్రైయర్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ టచ్ కంట్రోల్ ఎయిర్ ఫ్రైయర్ల ట్రెండ్స్:

కిచెన్ అప్లయన్సెస్ కేటగిరీలో ‘ఈజ్ ఆఫ్ యూజ్’, ‘స్మార్ట్ ఫీచర్స్’ ఉన్న ప్రొడక్ట్స్ కోసం యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. డిజిటల్ టచ్ స్క్రీన్ ప్యానెల్స్ ఉండడం వల్ల కేవలం ఒక్క టచ్‌తో చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, కేక్స్ వంటి రకరకాల వంటకాలను వండేయవచ్చు. టైమ్, టెంపరేచర్ స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తాయి కాబట్టి వంట చేయడం రానివారు కూడా వీటిని చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.

ఫిలిప్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ (Philips Digital Airfryer):

Advertisement

ఎయిర్ ఫ్రైయర్ల రంగంలో ఫిలిప్స్ ఎప్పుడూ కింగే. ఈ మోడల్‌లో ఇచ్చిన ప్రీ-సెట్ టచ్ స్క్రీన్ ప్యానెల్ ద్వారా ఒకే టచ్‌తో వంట స్టార్ట్ చేయవచ్చు. ఇందులో 7 రకాల వంటకాలకు సరిపోయేలా ముందే సెట్ చేసిన మెనూలు ఉంటాయి. దీని రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ వల్ల ఆహార పదార్థాలు బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా తయారవుతాయి. ఇది 90 శాతం వరకు నూనెను తగ్గిస్తుంది కాబట్టి హెల్త్‌కు చాలా మంచిది.

హ్యావెల్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ (Havells Digital Air Fryer):
ఇండియన్ కిచెన్స్‌కు బాగా సెట్ అయ్యేలా హ్యావెల్స్ ఈ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌ను డిజైన్ చేసింది. దీని ఎల్‌ఈడీ టచ్ కంట్రోల్ ప్యానెల్ చాలా రెస్పాన్సివ్‌గా ఉంటుంది. ఇందులో ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉంది. అంటే వంట పూర్తి కాగానే ఇది ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతుంది. దీని వల్ల ఫుడ్ మాడిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. దీని బాస్కెట్ నాన్-స్టిక్ కోటింగ్‌తో రావడం వల్ల క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ.

Advertisement

ఇన్సోలార్ డిజిటల్ న్యూట్రి-ఫ్రైయర్ (Inalsa Digital Air Fryer):
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇన్సాలా బెస్ట్ ఛాయిస్. దీని డిజిటల్ టచ్ స్క్రీన్ డిజైన్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో ఎనిమిది కంటే.. ఎక్కువ కుకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. పెద్ద ఫ్యామిలీస్ కోసం ఎక్కువ కెపాసిటీతో వచ్చే ఈ మోడల్, చాలా తక్కువ టైమ్‌లోనే హీట్ అవుతుంది. పవర్ సేవింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల కరెంట్ బిల్లు కూడా పెద్దగా రాదు.

అగారో రీగల్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ (Agaro Regal Air Fryer):
స్టైలిష్ లుక్ , ప్రీమియం ఫినిషింగ్‌తో వచ్చే అగారో ఎయిర్ ఫ్రైయర్ సూపర్ ట్రెండింగ్‌లో ఉంది. దీని టచ్ కంట్రోల్ ప్యానెల్ ఉపయోగించడం చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఓవర్ హీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. అంటే వోల్టేజ్ సమస్యలు వచ్చినా లేదా ఫ్రైయర్ ఎక్కువ వేడెక్కినా సేఫ్టీ ఫీచర్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. సమోసాలు, బేకింగ్ ఐటమ్స్ చేయడానికి ఇది పర్ఫెక్ట్.

పిజియన్ హెల్తీఫ్రై డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ (Pigeon Digital Air Fryer):
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో.. లభించే పిజియన్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ చిన్న కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్యానెల్ ద్వారా టెంపరేచర్‌ను మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ లేదా జీరో ఆయిల్‌తో కూడా.. ఇందులో డీప్ ఫ్రై లాంటి టేస్ట్‌ను తీసుకురావచ్చు. బడ్జెట్ తక్కువ ఉండి, స్మార్ట్ లుక్ కావాలనుకునే వారు దీనిని లాక్ చేసుకోవచ్చు.

మీరు హెల్తీ లైఫ్‌స్టైల్‌కి మారాలనుకుంటే.. ఒక మంచి డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోవడం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. బ్రాండ్ నమ్మకం, అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలంటే.. ఫిలిప్స్ లేదా హ్యావెల్స్ వైపు వెళ్ళవచ్చు. బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్ టచ్ ప్యానెల్ కావాలనుకుంటే ఇన్సాలా, పిజియన్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్స్. మీ కిచెన్ అవసరాలకు తగ్గ మోడల్‌ను ఎంచుకుని, ఆయిల్‌ ఫ్రీ వంటలను ఎంజాయ్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×