// // Best portable power banks 2026: ఛార్జింగ్ టెన్షన్‌కు బైబై.. తక్కువ ధరలో ఎక్కువ బ్యాకప్ ఇచ్చే పవర్ బ్యాంకులు! -->
E-Paper
Advertisement

ఛార్జింగ్ టెన్షన్‌కు బైబై.. తక్కువ ధరలో ఎక్కువ బ్యాకప్ ఇచ్చే పవర్ బ్యాంకులు!

ఛార్జింగ్ టెన్షన్‌కు బైబై.. తక్కువ ధరలో ఎక్కువ బ్యాకప్ ఇచ్చే పవర్ బ్యాంకులు!
Advertisement

Best portable power banks 2026: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే మన రోజు గడవడం లేదు. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు రీల్స్ చూడడానికో, గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వడానికో, లేదా ఫోటోలు దిగడానికో ఫోన్ వాడుతూనే ఉంటాం. కానీ.. సరిగ్గా అవసరమైన టైమ్‌కే మొబైల్ బ్యాటరీ ‘లో’ అయిపోతుంది. రైలు, బస్సుల్లో ఛార్జింగ్ సాకెట్లు ఖాళీగా ఉండవు. ఇలాంటి టైమ్‌లో మనల్ని కాపాడే రియల్ హీరోలే “పోర్టబుల్ పవర్ బ్యాంక్స్”. మీ జేబులో లేదా చిన్న బ్యాగులో ఇమిడిపోయే, ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్ అయిన 5 పవర్ బ్యాంకుల గురించి ఇప్పుడు చూద్దాం.

5 బెస్ట్ పవర్ బ్యాంకులు:

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన కొద్దీ పవర్ బ్యాంకుల అవసరం కూడా పెరిగింది. అయితే మార్కెట్లో పెద్ద సైజులో, బరువుగా ఉండే పవర్ బ్యాంకులు చాలా ఉన్నాయి. కానీ ప్రయాణాల్లో మనకు కావాల్సింది బరువు తక్కువగా ఉంటూ.. వేగంగా ఛార్జింగ్ ఎక్కించే కాంపాక్ట్ పవర్ బ్యాంకులు. 2026లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న 5 చిన్నపాటి పవర్ బ్యాంకుల లిస్ట్..

Advertisement

1. ఎంఐ 10000mAh పాకెట్ పవర్ బ్యాంక్ (Mi Pocket Power Bank):

పోర్టబుల్ పవర్ బ్యాంకుల అనగానే గుర్తొచ్చే మొదటి బ్రాండ్ ఎంఐ (Mi). దీని పాకెట్ సిరీస్ చాలా చిన్నగా, అరచేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది.

Advertisement

ఫీచర్లు: ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ప్లస్ పాయింట్: ఇందులో టైప్-సి (Type-C), టైప్-ఏ పోర్టులు ఉంటాయి. ఒకే సారి రెండు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీని బరువు చాలా తక్కువ, జేబులో వేసుకుని ఈజీగా తిరగొచ్చు.

2. యాంకర్ పవర్ కోర్ 10000mAh (Anker PowerCore):
ప్రపంచ వ్యాప్తంగా ఛార్జింగ్ టెక్నాలజీలో యాంకర్ బ్రాండ్‌కు తిరుగులేదు. క్వాలిటీ విషయంలో ఇది నెంబర్ వన్.

ఫీచర్లు: యాంకర్ పవర్ క్యూబ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉండే ‘వోల్టేజ్ బూస్ట్’ టెక్నాలజీ వల్ల మొబైల్స్ చాలా సేఫ్ గా, స్పీడ్‌గా ఛార్జ్ అవుతాయి.

ప్లస్ పాయింట్: మల్టీ-ప్రొటెక్ట్ సేఫ్టీ సిస్టమ్ వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటికీ ఇది బెస్ట్ ఛాయిస్.

3. అంబ్రానీ స్టైలో 10కే (Ambrane Stylo 10K):
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వాల్యూ ఆశించేవారికి అంబ్రానీ బెస్ట్ ఆప్షన్.ఇండియన్ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.

ఫీచర్లు: 20W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. దీని బాడీపై మంచి గ్రిప్ ఉంటుంది. చేతిలో నుంచి అస్సలు జారదు.

ప్లస్ పాయింట్: తక్కువ ధరలోనే 9 లేయర్ల చిప్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సే లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ పార్టనర్ ఇది.

4. రియల్‌మి 10000mAh క్విక్ ఛార్జ్ పవర్ బ్యాంక్ (Realme Quick Charge):
యూత్ ఫుల్ డిజైన్, ఎల్లో కలర్ టచ్‌తో రియల్‌మి పవర్ బ్యాంకులు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి.

ఫీచర్లు: ఇది 18W టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే ఫోన్ మాత్రమే కాదు, పవర్ బ్యాంక్ కూడా త్వరగా ఛార్జ్ అయిపోతుంది.

ప్లస్ పాయింట్: ఇందులో ‘లో కరెంట్ మోడ్’ ఉంటుంది. దీని వల్ల మీ స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: టైమ్ లేదు బాబోయ్ అనే వాళ్లకు గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్ కుక్కర్ ఉంటే వంట నిమిషాల్లోనే

5. క్రోమా 10000mAh లీ-పాలిమర్ పవర్ బ్యాంక్ (Croma Power Bank):
టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా బ్రాండ్ నుంచి వస్తున్న నమ్మకమైన ప్రొడక్ట్ ఇది.మెటాలిక్ ఫినిషింగ్‌తో ప్రీమియంగా కనిపిస్తుంది.

ఫీచర్లు: స్లిమ్ డిజైన్ దీని ప్రత్యేకత. ల్యాప్‌టాప్ బ్యాగులో లేదా హ్యాండ్ బ్యాగులో సైడ్ పాకెట్‌లో సులభంగా పెట్టేయవచ్చు.

ప్లస్ పాయింట్: ఎల్ఈడీ ఇండికేటర్లు పవర్ బ్యాంక్‌లో ఎంత ఛార్జింగ్ ఉందో క్లియర్ గా చూపిస్తాయి. లాంగ్ లైఫ్ ఇచ్చే లిథియం-పాలిమర్ బ్యాటరీ దీని సొంతం.

ప్రయాణాల్లో పవర్ బ్యాంక్ కొనేటప్పుడు కేవలం బ్యాటరీ సామర్థ్యమే కాదు.. అది ఎంత బరువు ఉంది. ఎంత వేగంగా ఛార్జ్ చేయగలదు అనేది చూసుకోవాలి. పైన చెప్పిన ఐదు పవర్ బ్యాంకులు కూడా మీ జర్నీని టెన్షన్ ఫ్రీగా మార్చేసేవే. మీ బడ్జెట్, బ్రాండ్ ఇష్టాన్ని బట్టి ఇందులో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని మీ ట్రావెల్ కిట్‌లో చేర్చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×