E-Paper
Advertisement

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!
Advertisement

Portable Cooling: సాధారణంగా ఉక్కపోత సమయంలో ప్రతీ ఒక్కరూ చల్లదనం కోసం వెతుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో, పనిచేసే ప్రదేశాల్లో వేడిని తట్టుకోవడం కొందరికి చాలా కష్టంగా మారుతుంది. అయితే అధిక వేడిని తట్టుకోలేని వారి కోసం అమెజాన్ లో అద్భుతమైన కూలింగ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు. ఇంతకీ ఆ టాప్ – 5 ప్రొడక్ట్స్, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

HandFan 5000mAh Neck Fan

చేతులతో ఫ్యాన్ పట్టుకునే పని లేకుండా మెడలో వేసుకునే సరికొత్త గ్యాడ్జెట్ ఇది. ఈ నెక్ ఫ్యాన్ ను 5000mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా కొన్ని గంటల తరబడి నాన్ స్టాప్ గా చల్లటి గాలిని అందిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Cooling Blanket

Advertisement

రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా సరిగ్గా నిద్రపట్టని వారికి కూలింగ్ బ్లాంకెట్ వరమనే చెప్పాలి. దీనిని ప్రత్యేకమైన శాస్త్రీయ సాంకేతికతతో కూడిన ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఇది శరీరంలోని అదనపు వేడిని పీల్చుకుని, చర్మ ఉపరితలాన్ని చల్లగా ఉంచుతుంది. ఏసీ లేదా ఫ్యాన్ గాలిలో దీన్ని వాడినప్పుడు మరింత మెరుగైన నిద్రను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

Cooling Desk Fan

ఆఫీసు లేదా ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు కూలింగ్ కోసం ఈ డెస్క్ ఫ్యాన్ ను రూపొందించారు. ఇది చాలా తక్కువ స్పేస్ ను తీసుకొని.. సైలెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల వర్క్ కు ఎలాంటి ఆటంకం ఉండదు. అంతేకాదు ఫ్యాన్ స్పీడ్ ను నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

Portable Handheld Fan

Advertisement

బ్యాగులో సులభంగా ఇమిడిపోయేలా దీన్ని తయారు చేసారు. మార్కెట్‌కు వెళ్లినప్పుడు, కరెంట్ పోయినప్పుడు ఈ పోర్టబుల్ హ్యాండ్హెల్డ్ ఫ్యాన్ ఎంతో ఉపయోగరంగా ఉంటుంది. బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీతో రావడం వల్ల ఛార్జింగ్ అయిన ప్రతీసారీ ఇంట్లోని ఛార్జ్ చేసుకోవచ్చు.

Bar Amigos Chill Rod

ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో చల్లని పానీయాలు తాగడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాగనీ డ్రింక్స్ లో ఐస్ వేస్తే అది కరిగి రుచి దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఈ సమస్యకు బార్ అమిగోస్ చిల్ రాడ్ చెక్ పెట్టనుంది. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ రాడ్‌ను కాసేపు ఫ్రీజర్‌లో ఉంచి ఆ తర్వాత వైన్ లేదా ఇతర పానీయాల బాటిల్‌లో ఉంచితే రుచి మారకుండా అది కొద్దిసేపటికే చిల్ అయిపోతుంది.

Also Read: సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!

Mini Personal Cooler

ఇది ఫ్యాన్ లా మాత్రమే కాకుండా చిన్నపాటి ఎయిర్ కూలర్ లాగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా నీరు లేదా ఐస్ ముక్కలు వేయడం ద్వారా ఇది సాధారణ ఫ్యాన్ కంటే మరింత చల్లని, తేమతో కూడిన గాలిని అందిస్తుంది. బెడ్ పక్కన లేదా స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది అత్యంత అనువైన సాధనమని నిపుణులు చెబుతున్నారు

Also Read: పెళ్లి తర్వాత అదృష్టం మారుతుందా? ఈ 4 అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న అమ్మాయిలకు ఫుల్ లక్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×