E-Paper
Advertisement

ఇంట్లోనే థియేటర్ వైబ్స్ ఇచ్చే టాప్-5 JBL Soundbars.. మూవీ నైట్ ఇక నెక్ట్స్ లెవల్!

ఇంట్లోనే థియేటర్ వైబ్స్ ఇచ్చే టాప్-5 JBL Soundbars.. మూవీ నైట్ ఇక నెక్ట్స్ లెవల్!
Advertisement

Top-5 JBL Soundbars: సాధారణంగా ఎంత ఖరీదైన టీవీ కొన్నా.. పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది కానీ సౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఏదో వెలితిగా అనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ బేస్ పడకపోయినా, మనకు నచ్చిన పాట వింటున్నప్పుడు ఆ స్పష్టత లేకపోయినా అస్సలు కిక్కు ఉండదు. ఈ నేపథ్యంలో టీవీ సౌండ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లి, ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీలింగ్‌‌ను కల్పించే టాప్-5 JBL సౌండ్‌బార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

JBL Cinema SB510

ఇంట్లో చోటు తక్కువగా ఉండి.. విడిగా సబ్‌వూఫర్ పెట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తుంటే.. ఈ SB510 బెస్ట్ ఆప్షన్. దీనిలో సబ్‌వూఫర్ లోపలే ఉంటుంది. 200 వాట్ల అవుట్‌పుట్‌తో వచ్చే ఈ సౌండ్‌బార్‌లో డైలాగ్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. కనెక్షన్ కూడా చాలా సింపుల్, ఒక్క కేబుల్‌తో పని అయిపోతుంది.

JBL Bar 500 Pro

Advertisement

సినిమా చూస్తున్నప్పుడు సౌండ్ మన చుట్టూ వినిపిస్తూ మంత్రముగ్ధులను చేయాలంటే ఈ 590 వాట్ల మోడల్‌ను ఎంచుకోవడం ఉత్తమం. దీనిలో డాల్బీ అట్మాస్ ఉంటుంది. దీంతో సౌండ్ మన తల పైనుంచి, పక్కల నుంచి వస్తున్నట్టుగా ఒక రియల్ థియేటర్ ఎఫెక్ట్ ఇస్తుంది. దీంతోపాటు వై-ఫై, అలెక్సా వంటి ఫీచర్లు ఉండటం వల్ల లేటెస్ట్ టెక్నాలజీ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

Also Read: టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేసిన డీల్ ఇదే.. Galaxy S25 Ultraపై అద్భుతమైన ధర తగ్గింపు!

JBL Cinema SB590

Advertisement

440 వాట్ల పవర్ ఉన్న ఈ సౌండ్‌బార్‌లో వైర్‌లెస్ సబ్‌వూఫర్ వస్తుంది. యాక్షన్ సీన్లలో వచ్చే పేలుళ్లు, పెద్ద పెద్ద సౌండ్స్‌ను ఇది చాలా లోతుగా, పవర్‌ఫుల్‌గా వినిపిస్తుంది. టీవీ కింద అమర్చుకోవడానికి ఇది చాలా స్లిమ్‌గా, చూడముచ్చటగా ఉంటుంది.

JBL Cinema SB271

మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా సూపర్ సౌండ్ సిస్టమ్ కావాలనుకుంటే SB271 బెస్ట్ ఆప్షన్. 220 వాట్ల పవర్, వైర్‌లెస్ సబ్‌వూఫర్ దీని స్పెషాలిటీ. ఈ సౌండ్‌బార్‌లో ఉండే రకరకాల సౌండ్ మోడ్స్ వల్ల మనం చూసే సినిమాని బట్టి లేదా వినే పాటను బట్టి ఆడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు.

JBL Bar 2.1 Deep Bass (MK2)

300 వాట్ల అవుట్‌పుట్‌తో వచ్చే ఈ మోడల్ మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరెట్. ఇందులో ఉండే సబ్‌వూఫర్ వల్ల బేస్ అదిరిపోతుంది. కేవలం టీవీయే కాదు.. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ నుంచి ప్లే లిస్ట్ ప్లే చేస్తే.. ఆ మ్యూజిక్ క్లారిటీకి ఫిదా అయిపోవాల్సిందే.

Also Read: వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×