E-Paper
Advertisement

ల్యాగ్ లేకుండా హెవీ గేమింగ్ ఆడాలా? రూ.30,000 లోపు లభించే ఈ క్రేజీ ఫోన్లపై ఓ లుక్కేయండి!

ల్యాగ్ లేకుండా హెవీ గేమింగ్ ఆడాలా? రూ.30,000 లోపు లభించే ఈ క్రేజీ ఫోన్లపై ఓ లుక్కేయండి!
Advertisement

Best Gaming Mobiles: ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా.. ఫ్లాగ్‌షిప్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్న వారి కోసం రూ.30 వేల లోపే శక్తివంతమైన ప్రాసెసర్లు, సూపర్ స్మూత్ డిస్‌ప్లేలు, గ్రాండ్ కూలింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్‌షిన్ ఇంపాక్ట్ వంటి హెవీ గేమ్స్ ఆడినా ఫోన్ హీట్ అవ్వకుండా, ఏమాత్రం ల్యాగ్ లేకుండా సెట్ అయ్యే ఆ 5 బెస్ట్ ఆప్షన్లు ఇక్కడ చూద్దాం.

POCO F7

మెరుగైన పనితీరు కోరుకునే వారికి POCO F7 ఒక బెస్ట్ ఛాయిస్. దీనిలో ఇచ్చే పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ గేమింగ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. దీని AMOLED డిస్‌ప్లే గేమ్‌లో ప్రతీ మూవ్‌మెంట్‌ను చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా చూపిస్తుంది. ఇక పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకుండా గంటల తరబడి గేమింగ్ ఆడుకోవచ్చు.

iQOO Neo 10R

Advertisement

లాంగ్ గేమింగ్ సెషన్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా, పెర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండాలంటే iQOO Neo 10R పర్ఫెక్ట్ అనే చెప్పాలి. దీని అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ ఫోన్‌ను ఎప్పుడూ కూల్‌గా ఉంచుతుంది. బ్రైట్ AMOLED డిస్‌ప్లే, క్విక్ ఛార్జింగ్ ఫీచర్లు కాంపిటీటివ్ గేమర్స్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. స్పీడ్, స్టెబిలిటీ కోరుకునేవారు దీనిని కొనుగోలు చేయొచ్చు.

Also Read: ఐఫోన్ యూజర్లకు మెటా సర్‌ప్రైజ్.. వాట్సప్ చాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది!

OnePlus Nord 5

Advertisement

ప్రీమియం లుక్‌లో ఉంటూ.. మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఆక్సిజన్ ఓఎస్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ ఫీల్ వస్తుంది. హెవీ గేమ్స్‌ను కూడా దీని చిప్‌సెట్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. డైలీ యూసేజ్‌తో పాటు గేమింగ్‌కు సరిపోయే మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఇందులో లభిస్తుంది.

Motorola Edge 60 Fusion

క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు గేమింగ్ ఆడాలనుకునే వారికి ఇది నచ్చుతుంది. దీని కర్వ్‌డ్ డిస్‌ప్లే గేమింగ్ చూసేటప్పుడు మంచి ఇమ్మర్సివ్ ఫీలింగ్ ఇస్తుంది. అనవసరమైన యాప్స్ (బ్లోట్‌వేర్) లేకుండా సాఫీగా సాగే ఇంటర్‌ఫేస్ దీని ప్రత్యేకత. రోజువారీ పనులకు, గేమింగ్‌కు సరైన బ్యాలెన్స్ ఇచ్చే ఫోన్ ఇది.

Nothing Phone (3a) Pro

విభిన్నమైన గ్లిఫ్ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించే ఫోన్ ఇది. కేవలం లుక్స్ మాత్రమే కాదు.. పెర్ఫార్మెన్స్, హీట్ మేనేజ్‌మెంట్ విషయంలోనూ ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. కలర్‌ఫుల్ visual ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే డిస్‌ప్లేతో పాటు అన్ని రకాల ఫీచర్లు ఉన్న ఒక ఆల్ రౌండర్ ఫోన్ కోరుకునే వారికి ఇది సరిపోతుంది.

Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×