E-Paper
Advertisement

ఎండలు మండిపోతున్నాయా? కరెంట్ బిల్లు భయం లేని 5 బెస్ట్ స్మార్ట్ ఏసీలు ఇవే..

ఎండలు మండిపోతున్నాయా? కరెంట్ బిల్లు భయం లేని 5 బెస్ట్ స్మార్ట్ ఏసీలు ఇవే..
Advertisement

Best Energy Saving Smart AC 2026: మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి.ఇక మే నెల వచ్చిందంటే భానుడి భగభగలకు ఇల్లు నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇలాంటి టైంలో ఏసీ ఆన్ చేయాలంటే కూలింగ్ మాట పక్కన పెడితే.. వచ్చే కరెంట్ బిల్లు చూసి గుండె జారడం ఖాయం! అందుకే ఇప్పుడు అందరి చూపు ‘ఎనర్జీ సేవింగ్ స్మార్ట్ ఏసీల’వైపు మళ్లింది. ఇవి తక్కువ కరెంట్ వాడుకుంటూనే రూమ్‌ను సూపర్ కూల్‌గా మారుస్తాయి. ఈ వేసవిలో మీ ఇంటి కోసం ఇన్వెస్ట్ చేయదగ్గ టాప్ 5 ఎనర్జీ సేవింగ్ స్మార్ట్ ఎయిర్ కండిషనర్ల వివరాలు ఇవే..

5 ఎనర్జీ సేవింగ్ స్మార్ట్ ఏసీలు:

Advertisement

ఈ రోజుల్లో ఏసీ కొనడం అనేది కేవలం లగ్జరీ కాదు. ఒక అవసరంగా మారింది. అయితే పాతకాలపు నార్మల్ ఏసీల వల్ల కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతాయి. అందుకే లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇన్వర్టర్ కంప్రెసర్ , స్మార్ట్ కనెక్టివిటీ ఉన్న ఏసీలను ఎంచుకోవడం బెస్ట్ పని. ఈ ఏడాది  వేసవిలో మార్కెట్‌ను రూల్ చేస్తున్న ఆ 5 బెస్ట్ మోడల్స్ ఏంటో చూసేయండి.

1. Daikin 1.5 Ton 5 Star Inverter Smart AC :
ఏసీల రంగంలో డైకిన్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. దీనిలోని ‘Econo Mode’ కరెంట్ ఖర్చును చాలా సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇందులో ఉండే స్మార్ట్ Wi-Fi ఫీచర్ ద్వారా మీరు ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడే మొబైల్ యాప్‌తో రూమ్ ఏసీ ఆన్ చేసుకోవచ్చు. దీని 3D ఎయిర్ ఫ్లో రూమ్ మొత్తం సమానంగా చల్లదనాన్ని అందిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక వచ్చే కాపర్ కండెన్సర్‌తో ఇది వస్తుంది.

Advertisement

2. LG 1.5 Ton 5 Star AI DUAL Inverter AC:
ఎల్‌జీ ఏసీలు వాటి 6-in-1 కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీకి బాగా పాపులర్. అంటే రూమ్‌లో ఉన్న మనుషుల సంఖ్యను బట్టి ఏసీ కెపాసిటీని (40% నుంచి 110% వరకు) మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల కరెంట్ విపరీతంగా ఆదా అవుతుంది. దీనిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వాడుక అలవాట్లను బట్టి ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను సెట్ చేస్తుంది.ఇది ‘LG ThinQ’ యాప్, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లతో పనిచేస్తుంది.

3. Panasonic 1.5 Ton 5 Star Wi-Fi Inverter AC:
టెక్నాలజీ పరంగా పానాసోనిక్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దీనిలోని ‘Miraie’ స్మార్ట్ యాప్ ద్వారా మీ ఏసీ ఎంత కరెంట్ వాడుకుందో రోజువారీ ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు.. ఇందులో ‘PM 0.1 Air Purification’ ఫిల్టర్ ఉంది. ఇది కేవలం చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా.. రూమ్‌లో ఉన్న డస్ట్, బ్యాక్టీరియాను క్లీన్ చేసి ప్యూర్ ఎయిర్‌ను అందిస్తుంది. హెల్త్ , సేవింగ్స్ రెండు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

4. Blue Star 1.5 Ton 5 Star Smart Inverter AC:
కమర్షియల్ కూలింగ్‌లో కింగ్ అయిన బ్లూ స్టార్, హోమ్ ఏసీల్లోనూ అద్భుతాలు చేస్తోంది. దీనిలోని ‘Heavy Duty’ కూలింగ్ టెక్నాలజీ బయట ఉష్ణోగ్రత 52 డిగ్రీలు దాటినా కూడా రూమ్‌ను క్షణాల్లో చల్లబరుస్తుంది. ఇది స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్‌తో వస్తుంది. అంటే ఏసీలో ఏదైనా చిన్న రిపేర్ వస్తే మొబైల్ యాప్‌లోనే అలర్ట్ చూపిస్తుంది. ఫైవ్-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల పవర్ బిల్లు చాలా తక్కువ వస్తుంది.

5. Godrej 1.5 Ton 5 Star 5-in-1 Convertible AC:
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో బెస్ట్ ఎనర్జీ సేవింగ్ ఏసీ కావాలంటే గోద్రేజ్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇందులో ఉపయోగించే R32 రెఫ్రిజెరెంట్ గ్యాస్ పర్యావరణానికి హాని చేయదు. కూలింగ్ స్పీడ్‌గా ఇస్తుంది. దీని యాంటీ-వైరల్ ఫిల్టర్ గాలిని శుభ్రంగా ఉంచుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, 5 స్టార్ పవర్ సేవింగ్స్ ఇచ్చే నమ్మకమైన ఇండియన్ బ్రాండ్ ఇది.

ఏసీ కొనేటప్పుడు ఈ టిప్స్ పాటించండి:
ASEER రేటింగ్: కేవలం స్టార్ రేటింగే కాదు, ఏసీ ISEER (ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో) వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత పవర్ సేవ్ అవుతుంది. 5-స్టార్ ఏసీల్లో 5.0 కంటే ఎక్కువ ISEER ఉన్నవి ఎంచుకోండి.

రూమ్ సైజ్: 110 నుంచి 150 చదరపు అడుగుల రూమ్ సైజ్ ఉంటే 1.5 టన్ ఏసీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఒక మంచి స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ కొనడం అనేది ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ లాంటిది. మొదట కొంచెం ధర ఎక్కువ అనిపించినా, లాంగ్ రన్‌లో ఇవి మీ కరెంట్ బిల్లులను సగానికి తగ్గించి ఆ డబ్బును రికవర్ చేస్తాయి. మీ బడ్జెట్ , బ్రాండ్ నమ్మకాన్ని బట్టి పై 5 మోడల్స్ లో ఒకదాన్ని ఎంచుకుని ఈ వేసవిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×