E-Paper
Advertisement

పవర్ సేవింగ్స్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ.. ఈ ఫ్రిజ్‌లతో మీ ఇల్లు సూపర్ స్మార్ట్!

పవర్ సేవింగ్స్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ.. ఈ  ఫ్రిజ్‌లతో మీ ఇల్లు సూపర్ స్మార్ట్!
Advertisement

Eco friendly refrigerators India: ఇంటికి ఫ్రిజ్ కొనడం అనేది ఒకప్పుడు కేవలం లగ్జరీ. కానీ ఇప్పుడు అది మన నిత్యజీవితంలో భాగం అయిపోయింది. అయితే.. 24 గంటలూ రన్ అయ్యే ఈ హోమ్ అప్లయన్స్ వల్ల కరెంట్ బిల్లే కాదు, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది. అందుకే ఇప్పుడు ట్రెండ్ మారింది.. పర్యావరణాన్ని రక్షిస్తూ, మీ కరెంట్ బిల్‌ను అదుపులో ఉంచే ఇకో-ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మీ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించి, గ్రీన్ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టాప్ 5 బెస్ట్ ఫ్రిజ్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పర్యావరణాన్ని కాపాడే టాప్ 5 ఇకో-ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్లు:

కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా.. స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ, గ్రీన్ గ్యాస్ (R600a) వాడే ఫ్రిజ్‌లకే యూజర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకోసం బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

Advertisement

1. శామ్‌సంగ్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ (Samsung Digital Inverter):
స్మార్ట్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు శామ్‌సంగ్ కేరాఫ్ అడ్రస్. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ కూలింగ్ అవసరాలకు తగ్గట్టుగా కంప్రెసర్ స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల కరెంట్ చాలా ఆదా అవుతుంది. అంతేకాదు, ఇందులో వాడే R600a రెఫ్రిజెరెంట్ గ్యాస్ ఓజోన్ పొరకు ఎలాంటి హాని చేయదు.

2. ఎల్‌జీ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ (LG Smart Inverter):
హోమ్ అప్లయన్సెస్‌లో ఎల్‌జీ ఎప్పుడూ ముందే ఉంటుంది. వీరి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ మోడల్స్ 5-స్టార్ రేటింగ్‌తో వస్తాయి. ఇవి తక్కువ శబ్దంతో పనిచేస్తూ.. మీ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను భారీగా తగ్గిస్తాయి. లోపల ఉండే ఎల్‌ఈడీ లైటింగ్ కూడా చాలా తక్కువ పవర్‌ను వినియోగిస్తుంది.

Advertisement

3. గోద్రెజ్ ఇయాన్ పవర్ కూల్ (Godrej Eon Series):
గ్రీన్ టెక్నాలజీని ఇండియాలో పరిచయం చేసిన బ్రాండ్లలో గోద్రెజ్ ఒకటి. వీరి ఇయాన్ సిరీస్ రిఫ్రిజిరేటర్లు 100% సీఎఫ్‌సీ (CFC), హెచ్‌సీఎఫ్‌సీ (HCFC)ఫ్రీ. అంటే ఇవి పర్యావరణానికి పూర్తిగా సురక్షితం. వీటి డిజైన్ , మేకింగ్ ప్రాసెస్ కూడా పర్యావరణ అనుకూలంగా ఉంటుంది.

4. వర్ల్‌పూల్ ఇంటెలిఫ్రెష్ ఇన్వర్టర్ (Whirlpool IntelliFresh):
వర్ల్‌పూల్ ఐక్యు టెక్నాలజీతో పనిచేసే ఈ ఫ్రిజ్.. లోపల ఉ:న్న ఆహార పదార్థాల బరువును బట్టి కూలింగ్‌ను ఇస్తుంది. దీని వల్ల అనవసరమైన పవర్ వేస్ట్ కాదు. ఎనర్జీ ఎఫిషియన్సీలో ఇది టాప్ క్లాస్ అని చెప్పొచ్చు. లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్‌నెస్ ఇస్తూనే పర్యావరణాన్ని కాపాడుతుంది.

Also Read: జులైలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు..టెక్ లవర్స్‌కు పండగే!

5. హయర్ ట్విన్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ (Haier Twin Inverter):
హయర్ బ్రాండ్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఇకో-ఫ్రెండ్లీ ఫీచర్లను అందిస్తోంది. దీనిలోని ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఫ్యాన్ మోటార్ , కంప్రెసర్ రెండూ వేర్వేరుగా ఆప్టిమైజ్ అవుతాయి. కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించడమే కాకుండా, గ్రీన్ ఎనర్జీకి సపోర్ట్ చేస్తుంది.

ఇకో-ఫ్రెండ్లీ ఫ్రిజ్ వల్ల లాభాలేంటి?
తక్కువ కరెంట్ బిల్లు: 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్‌లు మీ మనీని సేవ్ చేస్తాయి.

పర్యావరణ రక్షణ: గ్రీన్ గ్యాస్ టెక్నాలజీ వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది.

లాంగ్ లైఫ్: ఇన్వర్టర్ కంప్రెసర్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×