E-Paper
Advertisement

ధర తక్కువ.. గాలి ఎక్కువ.. మార్కెట్లో దుమ్మురేపుతున్న స్టాండ్ ఫ్యాన్లు ఇవే!

ధర తక్కువ.. గాలి ఎక్కువ.. మార్కెట్లో దుమ్మురేపుతున్న స్టాండ్ ఫ్యాన్లు ఇవే!
Advertisement

Best Pedestal Fans: కాలాలతో సంబంధం లేకుండా వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ‘ఫ్యాన్లు’ ముందు వరుసలో ఉంటాయి. ఎండ, వాన, చలి అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ పై ఆధారపడుతుంటారు. అయితే ప్రతీ మూలకు చల్లటి గాలిని అందించడంలో పెడెస్టాల్ లేదా స్టాండ్ ఫ్యాన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం చాలా రకాల బ్రాండ్స్.. పెడెస్టెల్ ఫ్యాన్లను అందిస్తున్నాయి. వాటిలో అత్యుత్తమైన టాప్ – 5 ఫ్యాన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

ఉషా మ్యాక్స్ ఎయిర్ అల్ట్రా

ఉషా కంపెనీకి చెందిన ఈ స్టాండ్ ఫ్యాన్.. అధునాతన ఏరోడైనమిక్ బ్లేడ్ డిజైన్‌ కలిగి ఉంది. ఇది గది అంతటా గాలిని అందిస్తుంది. ఇందులో 100 శాతం కాపర్ మోటార్‌ను ఉపయోగించడం వల్ల.. ఫ్యాన్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్ట్ ఫ్యూజ్ ఉండటం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గుల్లోనూ ఫ్యాన్ మోటార్ పాడవకుండా ఉంటుందని తెలియజేస్తోంది.

హావెల్స్ గతిక్ ప్రో

Advertisement

స్టైలిష్ లుక్, ట్రెండీ డిజైన్ కోరుకునేవారికి ఈ హవెల్స్ ఫ్యాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. 400 mm స్వీప్ సైజ్ కలిగిన ఈ ఫ్యాన్.. 1350 ఆర్.పీ.ఎం. వేగంతో పనిచేస్తుంది. దీని బ్లేడ్లు గట్టి ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారు చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక దీని హెవీ బేస్ డిజైన్ వల్ల ఫ్యాన్ తిరిగేటప్పుడు ఎలాంటి షేకింగ్ లేకుండా స్థిరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ స్టాండ్-82

తక్కువ శబ్దంతో, ఎక్కువ గాలి రావాలని కోరుకునేవారికి ఇది మంచి ఛాయిస్. ఈ పెడెస్టల్ ఫ్యాన్.. ఇందులో స్పీడ్ కంట్రోల్ కోసం క్లాసిక్ పియానో స్విచ్‌లను సైతం అందించారు. పివట్ మెకానిజం ద్వారా దీనిని కావలసిన కోణంలో ఈజీగా తిప్పుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

క్రాంప్టన్ స్టార్మ్ 450mm హై స్పీడ్

Advertisement

పెద్ద గది ఉన్న ఇంటికి ఈ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్. మార్కెట్లోని సాధారణ ఫ్యాన్ల కంటే దీని బ్లేడ్ సైజ్ ఏకంగా 450mmగా ఉంది. మెటల్ బాడీ, మెటల్ బ్లేడ్లతో వచ్చే ఈ ఫ్యాన్.. రఫ్ అండ్ టఫ్ యూజ్ కు పనికొస్తుంది.

Also Read: ఐసీయూలో కన్నతల్లి.. తల్లడిల్లిన జొమాటో బాయ్.. కస్టమర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు!

బజాజ్ ఫ్రోర్ నియో

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఫ్యాన్ కావాలనుకునే వారికి బజాజ్ ఫ్రోర్ నియో సరైన ఆప్షన్. తుప్పు పట్టని బాడీ, ఏరోడైనమిక్‌గా బ్యాలెన్స్ చేసే బ్లేడ్లు దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. 3-స్పీడ్ కంట్రోల్ ఆప్షన్‌తో వచ్చే ఈ బజాజ్ ఫ్యాన్.. మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఒక నమ్మకమైన ఆప్షన్ గా కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×