E-Paper
Advertisement

అమెజాన్‌లో జేబీఎల్ సౌండ్‌బార్ల హవా.. ఇల్లు థియేటర్‌లా మారాలంటే ఈ 5 మోడల్స్ చూడాల్సిందే!

అమెజాన్‌లో జేబీఎల్ సౌండ్‌బార్ల హవా.. ఇల్లు థియేటర్‌లా మారాలంటే ఈ 5 మోడల్స్ చూడాల్సిందే!
Advertisement

Best JBL soundbars on Amazon 2026: ఇంట్లోనే థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలని కోరుకునే వారికి జేబీఎల్ (JBL) బ్రాండ్ ఒక కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో జేబీఎల్ సౌండ్‌బార్‌లు (JBL Soundbars) రికార్డు స్థాయి సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. అదిరిపోయే బేస్, క్రిస్టల్ క్లియర్ ఆడియోతో కస్టమర్లను ఫిదా చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్, సినిమాలు ఎక్కువగా చూసేవారు ఎగబడి కొంటున్న టాప్ 5 జేబీఎల్ సౌండ్‌బార్ మోడల్స్ ఏంటో, వాటి స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌ను షేక్ చేస్తున్న జేబీఎల్ సౌండ్‌బార్‌లు:

ఈ రోజుల్లో కేవలం మంచి స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు.. దానికి తోడు పవర్‌ఫుల్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటేనే సినిమా చూసేటప్పుడు అసలైన మజా వస్తుంది. ఆడియోలో జేబీఎల్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే అమెజాన్‌లో ఈ బ్రాండ్ సౌండ్‌బార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 5 బెస్ట్ జేబీఎల్ సౌండ్‌బార్స్ లిస్ట్ మీకోసం..

1. జేబీఎల్ సినిమా ఎస్బీ271 (JBL Cinema SB271):

Advertisement

తక్కువ బడ్జెట్‌లో వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో వచ్చే బెస్ట్ సౌండ్‌బార్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది 2.1 ఛానల్ సౌండ్‌బార్‌తో పాటు 220 వాట్స్ పవర్‌ఫుల్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇందులో ‘డాల్బీ డిజిటల్’సపోర్ట్ ఉంది. దీని వైర్‌లెస్ సబ్‌వూఫర్ వల్ల రూమ్ అంతా అదిరిపోయే బేస్ వస్తుంది. రిమోట్‌లో ఉండే ‘వాయిస్ మోడ్’ బటన్ నొక్కితే సినిమాలో వచ్చే డైలాగులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి.

2. జేబీఎల్ బార్ 2.1 డీప్ బేస్ (JBL Bar 2.1 Deep Bass):

మీకు బేస్ ఎక్కువగా ఉండాలి. పాటలు వింటుంటే.. ఇల్లు ఊగిపోవాలి అనుకుంటే కళ్ళు మూసుకుని దీని వైపు వెళ్ళిపోవచ్చు. 300 వాట్స్ అవుట్‌పుట్‌తో వచ్చే ఈ మోడల్..పేరుకు తగ్గట్టే ‘డీప్ బేస్’ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. 6.5 ఇంచుల భారీ వైర్‌లెస్ సబ్‌వూఫర్ దీని సొంతం. బ్లూటూత్‌తో పాటు HDMI ARC, ఆప్టికల్ కేబుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ నుంచి కూడా ఈజీగా సాంగ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.

3. జేబీఎల్ బార్ 500 (JBL Bar 500):

Advertisement

ఇంట్లోనే పక్కా మల్టీప్లెక్స్ థియేటర్ వైబ్స్ కావాలనుకునే సినిమా పిచ్చోళ్ల కోసం డిజైన్ చేసిన ప్రీమియం మోడల్ ఇది. ఇది 5.1 ఛానల్ సౌండ్‌బార్, దీని టోటల్ పవర్ అవుట్‌పుట్ ఏకంగా 590 వాట్స్. ఇందులో ‘డాల్బీ అట్మోస్’, MultiBeam టెక్నాలజీ ఉన్నాయి. దీని వల్ల సౌండ్ రూమ్‌లోని నలుమూలల నుంచి త్రీ డీపద్ధతిలో వినబడుతుంది. వైఫై, ఎయిర్ ప్లే, అలెక్సా సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

4. జేబీఎల్ బార్ 2.0 ఆల్-ఇన్-వన్:

మీ బెడ్‌రూమ్ లేదా చిన్న హాల్ కోసం తక్కువ స్పేస్ ఆక్యుపై చేసే కాంపాక్ట్ సౌండ్‌బార్ కావాలంటే ఇది బెస్ట్. దీనికి విడిగా సబ్‌వూఫర్ ఉండదు. బార్ లోపలే ఇన్-బిల్ట్ బేస్ సిస్టమ్ ఉంటుంది. 80 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ డిజిటల్ సౌండ్, స్లిమ్ డిజైన్ దీని ప్లస్ పాయింట్స్. టీవీ కింద చాలా స్టైలిష్‌గా సెట్ అయిపోతుంది.

Also Read: లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలా? శామ్‌సంగ్, హయ్యర్, హైసెన్స్‌లలో ఏది బెస్ట్?

5. జేబీఎల్ బార్ 9.1 (JBL Bar 9.1):

డబ్బు ఎంతైనా పర్లేదు, హోమ్ థియేటర్ సెటప్‌లోనే టాప్ ఎండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకునే లగ్జరీ ఆప్షన్ ఇది. ఇది డిటాచబుల్ (ఊడదీయగలిగే) వైర్‌లెస్ సరౌండ్ స్పీకర్లతో వస్తుంది. ట్రూ డాల్బీ అట్మోస్, DTS:X సపోర్ట్, 820 వాట్స్ అవుట్‌పుట్ దీని పవర్. స్పీకర్లను విడదీసి మీ సోఫా వెనుక పెట్టుకుంటే థియేటర్ సిస్టమ్ లాగే సౌండ్ ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తాయి.

ఏది కొనాలి?
మీ బడ్జెట్ 10 నుంచి 12 వేలలోపు ఉంటే JBL SB271 బెస్ట్ చాయిస్. కొంచెం ఎక్కువ బేస్ కావాలంటే.. JBL Bar 2.1 తీసుకోండి. అదే హౌస్ పార్టీలు, పర్ఫెక్ట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం JBL Bar 500 ఇన్వెస్ట్‌మెంట్‌కు వాల్యూ ఫర్ మనీ మోడల్ అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్స్, బ్యాంక్ ఆఫర్స్ చూసుకుని మంచి డీల్ లాక్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×