Best 10 kg washing machines: ఇంట్లో మనుషులు ఎక్కువ మంది ఉంటే.. రోజూ బట్టలు చూసి భయపడాల్సిన పనిలేదు! విడతల వారిగా బట్టలు ఉతకడకంటే, 10కేజీ కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ వాడితే ..పని చిటికెలో పూర్తయిపోతుంది. దీని ద్వారా బెడ్ షీట్లు, హెవీ బ్లాంకెట్లు, డైలీ డ్రెస్‌లు ఒకే లోడ్‌లో హ్యాపీగా ఉతికేయొచ్చు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఏఐ టెక్నాలజీ, ఇన్వర్టర్ మోటార్లు, స్టీమ్ వాష్ ఫీచర్లతో వస్తున్న టాప్ 5 మోడల్స్ , వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్ జీ నుంచి వచ్చిన ఈ ఫ్రంట్ లోడ్ మెషీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాబ్రిక్ సెన్సింగ్‌తో పని చేస్తుంది. బట్టల బరువు, నాణ్యతను బట్టి వాషింగ్ సైకిల్‌ను అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రంట్ లోడ్, 5-స్టార్ రేటింగ్ దీని ప్రత్యేకతలు. ఏఐ డీడీ టెక్నాలజీ, 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్, ఇన్-బిల్ట్ హీటర్ కూడా ఇందులో ఉన్నాయి. బట్టలు పాడవకుండా ప్రీమియం వాషింగ్ ఫీల్ కోోరుకునే వారికి ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
శామ్‌సంగ్ ఎకోబబుల్ టెక్నాలజీతో వచ్చే ఈ మెషీన్ తక్కువ నీరు, డిటర్జెంట్‌తోనే మొండి మరకలను ఈజీగా వదిలిస్తుంది. దీని డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ శబ్దం లేకుండా వేగంగా పని చేస్తుంది. విశేషమేమిటంటే.. దీనిలోని ఏఐ ఎనర్జీ మోడ్ మీ కరెంట్ వాడకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంట్ బిల్లు తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద కుటుంబాలకు ఇది చాలా పొదుపైన ఆప్షన్.
మీ ఇంట్లో బోర్ నీరు లేదా హార్డ్ వాటర్ సమస్య ఉంటే.. ఐఎఫ్బీ మోడల్ చాలా బాగా సెట్ అవుతుంది. దీనిలోని ఆక్వా ఎనర్జీ టెక్నాలజీ నీటిలోని కఠినత్వాన్ని తగ్గించి, డిటర్జెంట్‌ను బట్టల్లోకి బాగా ఇంకేలా చేస్తుంది. 9 స్విర్ల్ వాష్ సిస్టమ్ వల్ల బట్టల రంగు పాడవకుండా.. ఫాబ్రిక్ నాణ్యత దెబ్బతినకుండా శుభ్రపడతాయి. లోపల ఉండే హీటర్ వల్ల వేడి నీటితో బట్టలను ఉతికి పరిశుభ్రంగా మార్చుకోవచ్చు.
వర్ల్‌పూల్ తన 6th సెన్స్ టెక్నాలజీకి బాగా ప్రసిద్ధి చెందింది. ఈ మెషీన్ బట్టల బరువును బట్టి ఎంత నీరు, ఎంత డిటర్జెంట్ కావాలో అంత మాత్రమే వాడుకుంటుంది. పెద్ద పెద్ద దుప్పట్లు, బెడ్‌షీట్లు, వేసినప్పుడు కూడా బట్టలు చిక్కుపడకుండా 360 డిగ్రీల కోణంలో ఉతికేస్తుంది. ఇన్-బిల్ట్ హీటర్ సహాయంతో పాతబడిన, మొండి మరకలను సైతం ఈజీగా తొలగించవచ్చు.
హైయర్ అందిస్తున్న ఈ మోడల్‌లో డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంటుంది. దీని వల్ల మెషీన్ నడుస్తున్నప్పుడు అసలు శబ్దం రాదు. రాత్రి వేళల్లో బట్టలు ఉతికినా .. ఇంట్లో ఎవరికీ ఆటంకం కలగదు. దీనిలో.. ఉండే ప్యూరి-స్టీమ్ టెక్నాలజీ బట్టలను ఫేఫ్ గా మారుస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ పాడవకుండా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్.
Also Read: డైలీ మార్నింగ్ కేఫ్ స్టైల్ కాఫీ కావాలా? ఈ గార్జెట్ మీ కోసమే
ఏ వాషింగ్ మెషీన్ ఎంచుకున్నా కొనే ముందు కనీసం 5-స్టార్ BEE రేటింగ్ ఉందో లేదో సరి చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ నెలవారీ కరెంట్ బిల్లును అదుపులో ఉంచుతుంది. అలాగే మీ బడ్జెట్, సౌకర్యాన్ని బట్టి ఫ్రంట్ లోడ్ లేదా టాప్ లోడ్ మోడల్స్ ఎంచుకోవచ్చు. సాధారణంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లు తక్కువ నీటిని వాడుతూ బట్టలను చాలా మెరుగ్గా ఉతుకుతాయి. కాకపోతే టాప్ లోడ్ మోడల్స్ వాడటానికి చాలా ఈజీగా ఉంటాయి.
సరికొత్త స్మార్ట్ ఫీచర్లు ఉన్న 10 కేజీల వాషింగ్ మెషీన్ మీ ఇంట్లో ఉంటే పనిని వేగంగా పూర్తవుతుంది. మీ కుటుంబ అవసరాలు, నీటి వసతి, బడ్జెట్‌కు తగిన మోడల్‌ను ఎంచుకుని టైం, శ్రమను ఆదా చేసుకోండి.