E-Paper
Advertisement

LED TV Overheating: మీ ఖరీదైన స్మార్ట్ టీవీ పాడవకూడదా? ఓవర్ హీటింగ్ సమస్యకు చెక్ పెట్టే 5 చిట్కాలు

LED TV Overheating: మీ ఖరీదైన స్మార్ట్ టీవీ పాడవకూడదా? ఓవర్ హీటింగ్ సమస్యకు చెక్ పెట్టే 5 చిట్కాలు
Advertisement

LED TV Overheating: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఎల్ఈడి (LED) టీవీలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే.. చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘ఓవర్ హీటింగ్ . టీవీని ఎక్కువ సేపు చూడటం వల్ల లేదా గదిలో గాలి సరిగ్గా ఆడకపోవడం వల్ల టీవీ వెనక భాగం విపరీతంగా వేడెక్కుతుంది. దీని వల్ల డిస్ప్లే తొందరగా పాడవ్వడమే కాకుండా.. లోపల ఉండే సెన్సిటివ్ సర్క్యూట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. మీ ఖరీదైన టీవీని చల్లగా ఉంచి,  ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే  పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ LED TV వేడెక్కుతోందా? 
మీ స్మార్ట్ టీవీ వేడెక్కడం అనేది కేవలం వాతావరణం మీద మాత్రమే కాదు. మీరు దాన్ని ఎక్కడ పెట్టారు, ఎలా వాడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. టీవీని కూల్‌గా ఉంచడానికి ఇక్కడ కొన్ని బెస్ట్ టిప్స్ ఉన్నాయి..

Advertisement

1. గాలి తగిలేలా చూడండి:
టీవీని గోడకు మరీ దగ్గరగా తగిలించకండి. టీవీ వెనక భాగంలో ఉండే రంధ్రాల ద్వారా లోపలి వేడి బయటకు రావాలి. మీరు టీవీని ఏదైనా క్యాబినెట్ లేదా అల్మారాలో పెట్టినట్లయితే.. దాని చుట్టూ కనీసం 4 నుంచి 6 అంగుళాల ఖాళీ ఉండేలా చూసుకోండి. గాలి సరిగ్గా ఆడితేనే టీవీ లోపలి భాగాలు చల్లగా ఉంటాయి.

2. నేరుగా ఎండ పడకుండా:
కిటికీల నుంచి వచ్చే ఎండ నేరుగా టీవీపై పడుతుంటే.. అది త్వరగా వేడెక్కుతుంది. సూర్యకాంతి వల్ల టీవీ ప్యానెల్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి.. టీవీని గదిలోని కాస్త చల్లగా ఉండే మూలలో.. అమర్చుకోండి లేదా ఎండ పడే సమయంలో కిటికీలకు కర్టెన్లు వాడండి.

Advertisement

3. దుమ్ము ధూళి చేరకుండా :
టీవీ వెనక ఉండే ‘వెంట్స్’ లో దుమ్ము పేరుకుపోతే.. లోపలి వేడి గాలి బయటకు వెళ్లదు. దీని వల్ల టీవీ హీట్ అవుతుంది. వారానికి ఒక సారి మెత్తటి బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్‌తో టీవీ వెనక భాగాన్ని శుభ్రం చేయండి. టీవీ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ తుడవకండి.

4. బ్రైట్‌నెస్ తగ్గించండి:
టీవీ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే.. బ్యాక్‌లైట్ ప్యానెల్ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఫలితంగా ఎక్కువ వేడి పుడుతుంది. అవసరం లేనప్పుడు బ్రైట్‌నెస్ తగ్గించండి లేదా ‘ఎకో మోడ్’ఆన్ చేసుకోండి. ఇది మీ టీవీని చల్లగా ఉంచడమే కాకుండా.. కంటికి కూడా మంచిది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కరెంట్ కూడా ఆదా అవుతుంది.

Also Read: బెస్ట్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ 2026..ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్, లేటెస్ట్ ఫీచర్లు ఇవే !

5. టీవీకి విశ్రాంతి ఇవ్వండి:
చాలా మంది టీవీని గంటల తరబడి ఆన్ లోనే ఉంచుతారు. నిరంతరం పని చేయడం వల్ల ప్రాసెసర్ మీద భారం పడి వేడెక్కుతుంది. ప్రతి 4-5 గంటల వాడకం తర్వాత ఒక 15 నిమిషాలు టీవీని ఆపివేయడం వల్ల అది తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

మరికొన్ని చిన్న జాగ్రత్తలు:
టీవీ దగ్గర  హీటింగ్ పరికరాలు (ఉదాహరణకు హీటర్లు, స్టవ్) లేకుండా చూడండి.

టీవీ పైన ఎలాంటి బట్టలు లేదా డెకరేషన్ వస్తువులు ఉంచకండి, అవి గాలిని అడ్డుకుంటాయి.

స్టెబిలైజర్ వాడటం వల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ తగ్గి.. సర్క్యూట్లు వేడెక్కకుండా ఉంటాయి.

LED టీవీ అనేది ఒక సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరం. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ టీవీ ఎక్కువ కాలం మన్నుతుంది. ఒకవేళ మీ టీవీ పైన చెప్పినవన్నీ చేసినా అసాధారణంగా వేడెక్కుతుంటే.. వెంటనే కంపెనీ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం బెస్ట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×