// // Smart Watch:- గుండె సమస్యలను గుర్తుపట్టే స్మార్ట్ వాచ్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Smart Watch:- గుండె సమస్యలను గుర్తుపట్టే స్మార్ట్ వాచ్..

Smart Watch:- గుండె సమస్యలను గుర్తుపట్టే స్మార్ట్ వాచ్..
Advertisement

Smart Watch:- స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్.. ఇలాంటివి మానవాళికి ఎంత చెడు చేస్తాయో అంతే మంచి కూడా చేస్తాయని కొందరి వాదన. ఒక్కసారి వీటిని అడిక్ట్ అయితే విడిచిపెట్టడం కష్టం అన్నదే ఇందులో ఉన్న నెగిటివ్ విషయం. అది పక్కన పెడితే.. వీటి వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తుంటారు. ఇప్పటికే వీటిని మానవాళికి మరింత ఉపయోగపడేలా మారుస్తూ వస్తున్నారు మేకర్స్. అలాగే తాజాగా స్మార్ట్ వాచ్‌లలో కూడా ఒక ఫీచర్‌ను యాడ్ చేయనున్నారు.

స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల హ్యామన్ యాక్టివిటీ గురించి సులువుగా తెలుసుకోవచ్చు. ఈరోజుల్లో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ వాచ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు మన పల్స్ రేటు, హార్ట్ బీట్ తెలుసుకుంటూ ఉండవచ్చు. కొన్నింటిలో అయితే మనం రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఎన్ని అడుగులు వేశాము అని తెలుసుకునే ఫీచర్ కూడా ఉంది. మన స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్ వాచ్‌కు కనెక్ట్ చేస్తే.. అందులోని సమాచారం అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ మనుషులకు తమ పనిని తేలిక చేసేశాయి. ఇవి కాకుండా స్మార్ట్ వాచ్‌తో ఇంకేదైనా చేయాలని మేకర్స్ భావించారేమో అందుకే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.

Advertisement

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనికి కచ్చితమైన కారణాలు ఏంటో శాస్త్రవేత్తలు కూడా తేల్చలేకపోతున్నారు. అందుకే గుండెపోటు వచ్చే అవకాశాన్ని గుర్తించేలాగా ఒక స్మార్ట్ వాచ్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా ఒకవేళ హార్ట్ బీట్ అనేది సరిగా లేకపోయినా కూడా ఇది యూజర్లకు సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ వాచ్ తయారీ మొదలయ్యి, దీనిపై పరీక్షలు కూడా జరిగాయి.

ఈ కొత్త రకమైన స్మార్ట్ వాచ్‌ల ద్వారా యూజర్లు 15 సెకండ్లలోనే ఈసీజీ టెస్ట్ చేసుకోవచ్చని, అప్పుడు అది యూజర్ల హార్ట్ బీట్‌ను, హార్ట్ రేట్‌ను స్టడీ చేసి సమాచారాన్ని అందిస్తుందని యాజమాన్యం అంటోంది. కేవలం ఆ క్షణంలోనే కాదు.. భవిష్యత్తులో కూడా వారికి గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఆ స్మార్ట్ వాచ్ ఇప్పుడే కనిపెట్టగలదని చెప్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి అందరికీ అందుబాటులోకి రానుందని ఓ ప్రైవేట్ సంస్థ ప్రకటించింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×