E-Paper
Advertisement

నడిచే పాము.. మొత్తానికి దొరికేసింది

నడిచే పాము.. మొత్తానికి దొరికేసింది
Advertisement

పాములు నడుస్తాయా? పాకుతాయా?… ఇది చాలా ఈజీ ప్రశ్న కదా? ఏ మాత్రం తడుముకోకుండా పాములు పాకేస్తాయని జవాబు ఇచ్చేస్తారు కదా. మీ జవాబు కరెక్టే, కానీ.. పాములకు కూడా కాళ్లు ఉంటాయని, అవి కూడా నడుస్తాయని అంటే నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. అయితే, ఈ పాము గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. దీనికి కాళ్లు ఉన్నాయట.

పాముకు కాళ్లా?

అవునండి.. మీరు చదివింది కరెక్టే. పాముకు కాళ్లు ఉన్నాయ్. ఒకప్పుడు మనుషులకు తోకలు ఉండేవన్నది ఎంత నిజమో.. ఇది కూడా అంతే నిజం. ఎందుకంటే.. ఈ విషయాన్ని పరిశోధకులే కన్ఫార్మ్ చేశారు. అర్జెంటీనాలో దొరికిన ఒక వింత పాము శిలాజాలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు. సుమారు 10 కోట్ల ఏళ్ల కిందటి ఈ శిలాజాలం.. ‘నజాష్ రియోనెగ్రినా’ అనే పాముకు చెందినదని పేర్కొన్నారు. ఇప్పటి పాముల్లా నజాష్ పాకకుండా నడిచి ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటి పాములకు, నజాష్‌కు తేడా ఇదే

Advertisement

శాస్త్రవేత్తలకు దొరికిన శిలాజాలం కోట్లాది ఏళ్ల నుంచి మట్టిలోనే కూరుకుపోయి ఉన్నది. దాని వల్ల అది గట్టి రాయిలా మారిపోయింది. అందుకే దాన్ని పాడు చేయకుండా మైక్రో-సీటీ స్కాన్ చేశారు. ఆ రాయిలో ఉన్న పాము ఎముకుల నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత దాని రక్త నాళాల మార్గాలను 3డీ బొమ్మలుగా మార్చి పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశోధకులకు దాని వెనుక భాగంలో చిన్న కాళ్లు కనిపించాయి. దీంతో ఒకప్పుడు పాములకు కాళ్లు ఉండేవని, కాలక్రమేనా అవి మాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. కొన్ని లక్షల ఏళ్ల కిందట మెల్ల మెల్లగా పాములు తమ కాళ్లను కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇంకా ఎన్నో మార్పులు

కేవలం కాళ్లు ఒక్కటే కాదు. నజాష్ పాములో ఇంకా చాలా తేడాలను కనిపెట్టారు. నజాష్ పాముకు జుగల్ అనే దవడ ఎముక ఉందని, ఇప్పటి పాములకు ఆ దవడ లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పాముల తల ఆకారం కూడా కాలక్రమేనా మారుతూ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే ఈ పాము నోరు, శరీరం చాలా పెద్దదిగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఈ పరిశోధన ద్వారా గత 160 ఏళ్లుగా ఉన్న తప్పుడు అంచనాలు నిజం కావని తేలిపోయింది. పాములు నేరుగా పాకే జంతువులుగా పుట్టలేదని, కాళ్లు ఉన్న జాతుల నుంచే క్రమేనా మారుతూ వచ్చాయని ‘నజాష్’ ద్వారా బయటపడింది. ఇలా నడిచే పాముతో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తే భలే ఉంటుంది కదూ. మీరేమంటారు?

Advertisement

Also Read: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×