E-Paper
Advertisement

ఫోన్ వెనుక లైటింగ్ ఎఫెక్ట్స్.. 8000mAh బ్యాటరీ.. Tecno Pova 8 5G ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

ఫోన్ వెనుక లైటింగ్ ఎఫెక్ట్స్.. 8000mAh బ్యాటరీ.. Tecno Pova 8 5G ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

Tecno Pova 8 5G: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో.. తమ సరికొత్త ఫీచర్లతో ‘టెక్నో పోవా 8 5G’ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను, ఎక్కువ సమయం ఫోన్ వాడేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఆకర్షణీయమైన లుక్, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్ ప్రత్యేకత.

ఈ ఫోన్ 6.76 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తోంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా ఉండేందుకు దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను వాడారు. ఇది 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 6GB, 8GB RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: iQOO షాకింగ్ నిర్ణయం.. భారీగా తగ్గిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు.. ఎగబడుతున్న జనాలు!

ఈ Tecno Pova 8 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. దీనిలో ఏకంగా 8000mAh బ్యాటరీని అమర్చారు. దీంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండ్రోజులు వాడుకోవచ్చు. అలాగే ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఎక్కువ సమయం ప్రయాణాల్లో ఉండే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

ఫోన్ వెనుక భాగంలో ఇచ్చిన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ ఈ మొబైల్‌కు ఒక ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. ఫోన్‌కు ఏవైనా నోటిఫికేషన్లు వచ్చినా, కాల్స్ వచ్చినా లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు వెనుక వైపు విభిన్నమైన యానిమేషన్లు, లైటింగ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇది ఫోన్‌కు ప్రీమియం ఇంకా స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.

Tecno Pova 8 5G వెనుక వైపు 50MP సోనీ ప్రైమరీ కెమెరాను అందించారు. దీని ద్వారా మంచి క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Also Read: యంగ్ జనరేషన్‌ కోసం Nothing సర్‌ప్రైజ్.. క్రేజీ కలర్‌లో కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×