E-Paper
Advertisement

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!
Advertisement

Tecno POP 9 5G: అద్భుతమైన ఫీచర్లు, కెమెరా క్వాలిటీ, స్పీడ్ ప్రాసెసర్ గల 5జీ స్మార్ట్‌ఫోన్‌ని అతి తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా?.. అలాంటి ఫోన్ కోసం ఎప్పటి నుంచో ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారా?.. అయితే ఇదే మీకు సరైన సమయం. ఎందుకంటే ఎన్నో కొత్త కొత్త ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టెక్నో కంపెనీ అదిరిపోయే ఫీచర్లు, కెమెరా క్వాలిటీ గల కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే ఎన్నో మోడళ్లను రిలీజ్ చేసిన కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న Tecno POP 9 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Tecno కొత్త స్మార్ట్‌ఫోన్ POP 9 5G సెప్టెంబర్ 24న భారతదేశంలో లాంచ్ కానుంది. తక్కువ బడ్జెట్‌లో ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇచ్చే సరసమైన 5G మొబైల్‌గా చెప్పుకొస్తున్నారు. దీన్ని పోస్టర్‌ను కంపెనీ అమెజాన్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 4 GB RAM, 48 MP సోనీ IMX582 ప్రైమరీ సెన్సార్‌ ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో పెద్ద బ్యాటరీ అందించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

Tecno POP 9 5G సెప్టెంబర్ 24న భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ ఈ ఫోన్‌ పూర్తి ధరను వెల్లడించనప్పటికీ.. చిన్న హింట్ అయితే ఇచ్చింది. ఈ కొత్త ఫోన్ దాదాపు రూ.10,000 లోపు ఉండబోతున్నట్లు కంపెనీ దీని ధరను చెప్పే ప్రయత్నం చేసింది. Amazon టీజర్‌లో ఈ ఫోన్ ధర ₹_,499గా నిర్ణయించబడింది. అంటే రూ.10 వేల లోపే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్‌ ధరతో పాటు స్పెసిఫికేషన్లకు సంబంధించిన కొన్నింటిని కంపెనీ తెలిపింది.

Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

Advertisement

Tecno POP 9 5G స్మార్ట్‌ఫోన్ 120Hz HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మొత్తం రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. అందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్, అలాగే 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఫోన్ ర్యామ్‌ను వర్చువల్‌గా 4 GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ అందించబడింది. అలాగే 48 MP సోనీ IMX582 సెన్సార్‌ను కలిగి ఉన్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ తెలిపింది.

ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.  అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఇది IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా ఫోన్ సౌండింగ్ కోసం స్టీరియో స్పీకర్లను అందించారు. అలాగే ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్‌లు త్వరలో అమెజాన్‌లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×